నేడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 100వ జయంతి. నటుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. తెలుగు ప్రజలు అభిమానంతో ఎంటోడు అంటూ పిలుచుకునే ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా సినీ నటులు, సన్నిహితులు, రాజకీయ నేతలు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన మధుర స్మృతులను తలుచుకుంటున్నారు. పలువురు సినిమా తారలు, రాజకీయనేతలు ఎన్టీఆర్ ఘాట్ ని దర్శించుకొని నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ ని దర్శించుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం ఈ రోజున ఆయనను తలుచుకుంటున్నారు.. ఆయన పుట్టిన మట్టిలోనే పుట్టిన అదృష్టం కలిగినవాడిగా.. వారి ద్వారా మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి.. ఆయన చూపిన దారిలో.. ఆయన ఇచ్చిన సలహాలకు తగినట్టుగా.. ఈ రోజున మీముందు ప్రత్యక నటుడిగా మీముందు నుంచున్న నాకు.. ఆ బిక్షను ప్రసాదించిన.. నా దేవుడు ఎన్టీఆర్ అన్నారు రాజేంద్ర ప్రసాద్.
అలాగే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పూజ్యులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నాకు ప్రపంచ నలు మూలాల నుంచి నన్ను రమ్మని ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకుందాం అని పిలిచారు. ఆయన మా ఇంట్లో మనిషి అంటూ.. నన్ను ఆహ్వానించారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అన్నగారి పేరుమీద అన్నదానాలు జరుగుతున్నాయి. తెగులు జాతి గర్వించదగిన ఒక మహానుభావుడు.. తెలుగు జాతిని ప్రపంచానికి తెలియజెప్పిన మహనీయుడు ఎన్టీఆర్.. అలాంటి ఆయనను మీరందరు తలుచుకుంటున్నారంటే. ఆయనకు చాలా సంతోషంగా ఉండుంటారు.. కొన్ని సంవత్సరాలపాటు ఆయన పక్కనే ఉండి శిష్యరికం చేసిన వ్యక్తిగా.. చిరాకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అన్నారు అంటూ అన్నగారిని స్మరించుకున్నారు రాజేంద్ర ప్రసాద్.