Vikrant Rona: విక్రాంత్ రోణా సినిమాకు రివ్యూ ఇచ్చిన రాజమౌళి.. గట్స్ ఉండాలన్న జక్కన్న
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది.

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ(Vikrant Rona). పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమాకు సాధించిన విజయం పై డైరెక్టర్ రాజమౌళి స్పందించాడు. విక్రాంత్ రోణ మూవీ టీంను అభినందిస్తూ.. తాజాగా ట్వీట్ చేశారు. కంగ్రాట్యూలేషన్స్ కిచ్చా సుదీప్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ విక్రాంత్ రోణా. ఇలాంటి లైన్‌ను పిక్ చేసుకోవాలంటే.. గట్స్ ఉండాలి. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ అండ్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సూపర్బ్. అని తన ట్వీట్లో రాసుకొచ్చారు రాజమౌళి. దాంతో పాటు గుడ్డిస్ ఫ్రెండ్ భాస్కర్‌ను స్పెషల్ గా మెన్షన్ చేసి.. సినిమాపై మరింతగా హైప్ పెంచారు రాజమౌళి.
ఇక త్రీడీ మిస్టర్ థ్రిల్లర్ గా రూపొందిన విక్రాంత్ రోణ చిత్రాన్ని ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్ పై జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించారు. ఇక మరోవైపు రా..రా.. రక్కమ్మా మాస్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇందులో నీరూప్ భండారి, నీతా అశోక్ కీలకపాత్రలలో నటించారు.



