RRR Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తుంది. థియేటర్స్ అన్నింటిలో ఆర్ఆర్ఆర్ సినిమా సందడి చేస్తుంది. అదుపు నాలుగేళ్లుగా సినిమా కోసం ఎదురుచూసిన అభిమానులకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను అందించారు దర్శక ధీరుడు రాజమౌళి. యంగ్ టైగర్(NTR), మెగాపవర్ స్టార్(Ram Charan) ఇద్దరు తన నట విశ్వరూపం తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు అంటున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్. కొమురం భీమ్ గా తారక్ , అల్లూరిసీతారామ రాజుగా మెగాపవర్ స్టార్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్. ఇక ఈ సినిమా మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ ఊపేస్తోంది. అక్కడ ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ దక్కాయి. యుఎస్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది ఆర్ఆర్ఆర్. యుఎస్ లో సరికొత్త రికార్డును తిరగరాసే దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా. కేవలం ప్రిమియర్లతోనే అందరిని ఆశ్చర్య పోయేలా చేస్తోంది ఆర్ఆర్ఆర్.
హాలీవుడ్ ట్రేడ్ పండిట్లను షాక్ కు గురిచేస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ. కేవలం ప్రిమియర్లతోనే 3 మిలియన్ డాలర్లకు పైగా ఈ చిత్రం వసూల్ చేసింది. మొత్తంగా ఈ సినిమా ఓపినింగ్స్ 4.50 మిలియన్ డాలర్స్ ను రాబట్టింది ఆర్ఆర్ఆర్. ఒక్కరోజే 4.50 మిలియన్ డాలర్లకు పైగా ఈ చిత్రం కొల్లగొడుతోందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వీకెండ్లో హాలీవుడ్ బాక్సాఫీస్ లిస్ట్ లో ‘ఆర్ఆర్ఆర్’దే అగ్రస్థానం కావడం విశేషం. హాలీవుడ్లో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాకపోవడం దీనికి కలిసొచ్చింది. ఇండియన్ సినిమాస్ లో బిగెస్ట్ ఓపినింగ్స్ సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను క్రియేట్ చేసింది ఈ మూవీ. ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ చూస్తుంటే వీకెండ్లో 10 మిలియన్ మార్కును అవలీలగా అందుకుంటుందని.. ఫుల్ రన్లో 15 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు ఉండొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :