Raja Shekar: విడుదలైన శేఖర్‌ గ్లింప్స్. పవర్‌ఫుల్‌ లుక్స్‌తో ఆకట్టుకున్న రాజశేఖర్‌..

|

Nov 25, 2021 | 6:39 PM

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శేఖర్‌'. 'ది మ్యాన్‌ విత్‌ ది స్కార్‌' అనేది ఉపశీర్షిక. రాజశేఖర్‌ సతీమణి జీవితా రాజశేఖర్‌ మరోసారి మెగా ఫోన్‌ పట్టి స్వయంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Raja Shekar: విడుదలైన శేఖర్‌  గ్లింప్స్. పవర్‌ఫుల్‌ లుక్స్‌తో ఆకట్టుకున్న రాజశేఖర్‌..
Follow us on

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శేఖర్‌’. ‘ది మ్యాన్‌ విత్‌ ది స్కార్‌’ అనేది ఉపశీర్షిక. రాజశేఖర్‌ సతీమణి జీవితా రాజశేఖర్‌ మరోసారి మెగా ఫోన్‌ పట్టి స్వయంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. . బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇది రాజశేఖర్‌ నటిస్తోన్న 91వ చిత్రం. పైగా జీవితా రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఎన్నో విశేషాలతో కూడుకున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలైంది.

‘అరుకు  బంగ్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య.. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించకుండా ఎవరీ గురించి వెయిట్‌ చేస్తున్నాడీయన..మీకు తెలియదా సార్‌.. కొన్ని రోజుల క్రితం రిజైన్‌ చేశాడు కదా.. శేఖర్‌ అని.. అతని గురించే వెయిటింగ్‌. వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా.. వాడు చేసేది మనకు చెప్పాడా’ అని టీజర్‌ ప్రారంభంలో హీరో పాత్ర గురించి చెప్పిన డైలాగులు బాగా పేలాయి. ఇక ఈ టీజర్‌లో రాజశేఖర్‌ తెల్లటి గుబురు గడ్డం, సాల్ట్ అండ్‌ పెప్పర్‌ లుక్‌ స్టైల్‌లో కనిపించి అలరించారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. థ్రిల్లర్‌ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.Also Read:

R Madhavan: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో బ్రీత్‌‌లెస్ సాంగ్.. స్టన్ అయిన నటుడు మాధవన్.. ఇన్‌స్టాలో పోస్ట్‌

Ramgopal Varma: యండమూరి వీరేంద్రనాథ్‌ కథతో భయపెట్టడానికి సిద్ధమైన ఆర్జీవీ.. టైటిల్‌ ఏంటో తెలుసా.?

Poonam Bajwa: కుర్రాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా.. పూనమ్ బజ్వా ఫోజులు..