
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి నేరుగా అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. మొన్నటివరకు తమిళ్, మలయాళంలో సినిమాలు చేసిన ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టింది. పట్టంపోలే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన నటించి మెప్పించింది. మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో వరుసగా సినిమాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ మొన్నటివరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ డబ్బింగ్ సినిమాలతోనే ఫేమస్ అయ్యింది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్ కూడా నటించారు. ఇక మాళవిక మోహనన్ తన అందంతో.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా రిజెల్ట్ పక్కనపెడితే ఈ ముద్దుగుమ్మ నటనకు అందానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు.
తాజాగా మాళవిక మోహనన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. చాలా కాలం క్రితం తెలుగు, తమిళ్ సినిమాలో హీరోయిన్స్ డైలాగ్స్ ను పట్టించుకునేవారు కాదు.. ఓ ఎమోషనల్ సీన్స్ లో నటించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు అంటూ నెంబర్స్ లెక్కబెట్టేవారని మాళవిక తెలిపారు. కోపం, సీరియస్ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఏ, బీ, సి, డీ అంటూ చదివేవారు అని మాళవిక తెలిపింది. లిప్ సింక్ కు సెట్ అయ్యేలా ఏవేవో చదివే వారు.. కొన్నేళ్లుగా అలాంగ్ నెట్టుకొచ్చారు. కానీ నేను అలా చేయను. కెరీర్ మొత్తం వాళ్లు ఇలానే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది మాళవిక ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
#MalavikaMohanan Acting in Master was trolled by all with her expression
But She Commenting on others pic.twitter.com/tASuISbGrh
— SillakiMovies (@sillakimovies) January 21, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..