దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమాను కూడా పి.వాసునే దర్శకత్వం వహించాడు.తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించనున్నారు. వేట్టయ రాజాపై ప్రతీకారం తీర్చుకోవటానికి చంద్రముఖిగా కంగనా రనౌత్ సిద్ధమైంది. అసలు వీరి మధ్య జరిగిన అసలైన కథేంటి.. వేట్టయ రాజాపై చంద్రముఖి ప్రతీకారం తీర్చుకుందా.? ఆమె పగ చల్లారిందా.? అనే విషయాలు తెలియాంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్రయూనిట్.హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు వడివేలు తనదైన కామెడీతో మెప్పించటానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 24న ‘చంద్రముఖి 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నిర్వహించనున్నారు. లారెన్స్, కంగనా రనౌత్ సహా ఎంటైర్ యూనిట్ ఈవెంట్‌లో పాల్గొనున్నారు. యువీ మీడియా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ తో పాటు వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష నటిస్తున్నారు. చంద్రముఖిగా జోతిక అద్భుతంగా నటించి మెప్పించారు. కంగనా ఆమె తరహాలో మెప్పిస్తారా అన్నది చూడాలి. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Chandramukhi-2 fun making video. 🤗✨ Laughter and chaos behind the scenes! 😆🌸#Chandramukhi2 🗝️
🎬 #PVasu
🌟 @offl_Lawrence @KanganaTeam
🎶 #MMKeeravaani
🎥 @RDRajasekar
🛠️ #ThottaTharani
✂️🎞️ @editoranthony
✨ @realradikaa Vaigaipuyal #Vadivelu #LakshmiMenon @Mahima_Nambiar pic.twitter.com/9ZTcKlqa2D— Lyca Music (@LycaMusic) September 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.