
సీనియర్ హీరో విజయ్‌కాంత్ మరణాన్ని ఇంకా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులు. అనారోగ్యం కారణంగా విజయ్ కాంత్ మరణించిన విషయం తెలిసిందే. కెప్టెన్ విజయ్ కాంత్ మరణంతో కోలీవుడ్ మూగబోయింది. సినీ సెలబ్రెటీలు కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. సూర్య, విశాల్ లాంటి హీరోలు కన్నీళ్లు పెట్టుకున్నారు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన విజయ్ కాంత్ మరణించడం కోలీవుడ్ కు తీరని లోటే.. దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ కొద్ది రోజుల క్రితమే తన తల్లితో కలిసి విజయ్‌కాంత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. అయితే విజయ్ కాంత్ తనయుడు షణ్ముగ పాండియన్ సినీ బాధ్యతలు తీసుకోవాలని లారెస్ ను విజయ్ కాంత్ కుటుంబసభ్యులు కోరినట్టు తెలుస్తోంది.
దాంతో షణ్ముగ పాండియన్ బాధ్యతలు లారెన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. షణ్ముగ పాండియన్ చేసే నెక్స్ట్ సినిమాలో నేను కూడా నటిస్తాను. కుదిరితే దర్శకులు మల్టీస్టారర్ కాన్సెప్ట్‌తో రండి. అప్పుడు ఇద్దరం ప్రధాన పాత్రల్లో నటించే వీలుంటుంది. అలాగే కెప్టెన్ రెండో కుమారుడు విజయ ప్రభాకరన్ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలుపుతూ విజయ్‌కాంత్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ లో వీడియో రిలీజ్ చేశాడు లారెన్స్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
విజయ్ కాంత్ కోలీవుడ్ కు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే.. ఆయన సినిమాలు చాలా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సందేశాత్మక చిత్రాలతో విజయ్ కాంత్ బాగా పాపులర్ అయ్యారు. లారెన్స్ ఇప్పుడు విజయ్ కాంత్ కొడుకు బాధ్యతలు తీసుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
I’m happy to share with you all that I’m ready to do a cameo role in captain sir’s Son Shanmuga Pandian’s movie as my respect and love for Vijayakanth sir 🙏🏼 pic.twitter.com/zIlNBqnVs2
— Raghava Lawrence (@offl_Lawrence) January 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.