Raghava Lawrence: సొంత డబ్బుతో రైతులకు ట్రాక్టర్లు.. ప్రతిఫలంగా లారెన్స్‌కు అన్నదాతలు ఏమిచ్చారో చూడండి.. వీడియో

ఈ మధ్యన సినిమాల కంటే తన సామాజిక సేవా కార్యక్రమాలతో నే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్. ఇటీవల ఓ కూలీ దాచి పెట్టుకున్న డబ్బులు చెదలు పట్టగా వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాడు లారెన్స్.

Raghava Lawrence: సొంత డబ్బుతో రైతులకు ట్రాక్టర్లు.. ప్రతిఫలంగా లారెన్స్‌కు అన్నదాతలు ఏమిచ్చారో చూడండి.. వీడియో
Raghava Lawrence

Updated on: May 15, 2025 | 4:12 PM

సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్స్ లో రాఘవ లారెన్స్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల పక్కన సైడ్ డ్యాన్సర్ గా పని చేసిన అతను ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. అంతేకాదు హీరోగా, డైరెక్టర్ గా , నిర్మాత గానూ సత్తా చాటుతున్నాడు. ఇంకోవిషయమేమిటంటే.. సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన వారిలో లారెన్స్ కూడా ఒకడు. అందుకే అతనంటే చాలామందికి అభిమానం ఉంది. వీటన్నటికీ మించి తన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు లారెన్స్. సాయం కోసం ఎవరైనా చేయి చాచితే.. నేనున్నానంటూ ముందుకొస్తాడీ రియల్ హీరో. ఇప్పటికే తన ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడీ హీరో. అనాథలకు చదువు చెప్పడం దగ్గరినుంచి రైతులకు ఉచితంగా ట్రాక్టర్ల పంపిణీ, మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్లు.. ఇలా ఒకటేమిటీ ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు లారెన్స్. కాగా గతంలో ఈ హీరో తన సొంత డబ్బులతో అన్నదాతలకు ట్రాక్టర్లను కొనిచ్చిన సంగతి తెలిసిందే. వాటిని తీసుకున్న రైతులు తాజాగా లారెన్స్ ను కలిశారు. తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పల్లి కాయలను నటుడికి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు రాఘవ.

‘హాయ్ ఫ్రెండ్స్ అభిమానులారా, నా సొంత డబ్బుతో మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా రైతులకు 10 ట్రాక్టర్లను అందజేసినట్లు మీ అందరికీ తెలుసు. రైతులు నాకు ఫోన్ చేసి ట్రాక్టర్లను ఉపయోగించి పండించిన ధాన్యాలు, కూరగాయలన్నింటినీ తీసుకొస్తామని కోరుకున్నారు. వారి చేతుల నుంచి వాటిని అందుకోవడానికి నా మనసు సంతోషంతో నిండి పోయింది. భవిష్యత్తులో రైతులకు మరిన్ని విరాళాలు అందించే శక్తిని నాకు ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చాడు లారెన్స్.

ఇవి కూడా చదవండి

లారెన్స్ షేర్ చేసిన వీడియో..

ప్రస్తుతం రాఘవ లారెన్స్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా రియల్ హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.