Radisson Drugs Case: డ్రగ్స్ కేసులో సరికొత్త ట్విస్ట్.. హోటల్ అపరేషన్స్ మేనేజర్‌ పై ఎఫ్ఐఆర్

ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాడిసన్ హోటల్ అపరేషన్స్ మేనేజర్‌పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్‌లోని 1200, 1204 రూమ్‌లలో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని, తనిఖీల్లో భాగంగా హోటల్‌లోనే డ్రగ్స్ దొరకడంతో హోటల్ అపరేషన్స్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.

Radisson Drugs Case: డ్రగ్స్ కేసులో సరికొత్త ట్విస్ట్.. హోటల్ అపరేషన్స్ మేనేజర్‌ పై ఎఫ్ఐఆర్
Radisson Drugs Case

Updated on: Mar 02, 2024 | 9:05 PM

రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. ఈ కేసులో రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో.. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాడిసన్ హోటల్ అపరేషన్స్ మేనేజర్‌పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్‌లోని 1200, 1204 రూమ్‌లలో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని, తనిఖీల్లో భాగంగా హోటల్‌లోనే డ్రగ్స్ దొరకడంతో హోటల్ అపరేషన్స్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ముందే తెలిసి రూమ్స్ ఇచ్చాడని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పటికే హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానంద, టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన స్నేహితుడు చరణ్‏ను కలిసెందుకే పార్టీకి వెళ్లానని.. అక్కడ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రిష్ ను విచారించిన పోలీసులు అనంతరం రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.

మరోవైపు రాడిసన్‌ డ్రగ్స్‌ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు బయటపడ్డాయి. స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకొని మీర్జా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి నెలలోనే రాడిసన్ హోటల్లో పదిసార్లు డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 24న కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు హాజరయ్యారని తెలిపారు. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్, గచ్చిబౌలి ISB , జూబ్లీహిల్స్ లో కొకైన్ ను అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మిర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్‌లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది. డ్రగ్స్ కేసు ఎప్పుడు బయటకు వచ్చినా సినిమా తారల పేర్లు ఖచ్చితంగా బయటకు వస్తున్నాయి. ఈసారి కూడా క్రిష్ తో పాటు పలువురి పేర్లు బయటకు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.