
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మీర్జా వహీద్ దగ్గర కొకైన్ కొనుగోలు చేసిన అబ్బాస్.. కొనుగోలు చేసిన కొకైన్‌ను గజ్జల వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు అప్పగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రాము కొకైన్ రూ.14 వేలకు కొని వివేకానందకు విక్రయించాడు అబ్బాస్. ఏడాదిగా డ్రగ్స్‌కు అలవాటుపడ్డ గజ్జల వివేకానంద..డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్.. గూగుల్ పే పేమెంట్స్‌ను సేకరించారు పోలీసులు.
— వీకెండ్స్ లో రెగ్యులర్‌గా రాడిసన్ హోటల్‌కి వచ్చే వివేకానంద్.. తన స్నేహితులతో ఏడాదిగా పార్టీలు నిర్వహించేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. వివేకానంద్ నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు.. సినీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. రీసెంట్ గా ఈ నెల 16, 18, 19, 24 న సైతం గజ్జల వివేక్ కు అబ్బాస్ కొకైన్ సప్లై చేసినట్లు గుర్తించారు మాదాపూర్ పోలీసులు.
డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్నారు డైరెక్టర్ క్రిష్. A10 నిందితుడిగా ఉన్న క్రిష్ పరారీలో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇప్పటికే క్రిష్‌కు 160 కింద నోటీసులు జారీ చేశారు. సోమవారం వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, వ్యూహాత్మకంగానే క్రిష్ జాగర్లమూడి పోలీస్ విచారణకు గడువు తీసుకున్నట్టుగా డౌట్స్ వస్తున్నాయి. సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం కొకైన్.. తీసుకుంటే దాని ఆనవాళ్లు బ్లడ్‌లో 2రోజుల వరకు ఉంటాయి. మూత్రంలో 3 రోజుల వరకు కనిపిస్తాయి. ఉమ్మిలో 2 నుంచి 3రోజుల వరకు కొకైన్ ఆనవాళ్లు ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. తరచుగా సేవించే వారి వెంట్రుకల్లో 90రోజుల వరకు కొకైన్‌ను కనిపెట్టవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు డ్రగ్ టెస్టులు జరిపిస్తే ఎలాంటి ఆధారాలు దొరకకుండా క్రిష్ జాగర్లమూడి విచారణకు హాజరవ్వడం లేదని కొందరు అంటున్నారు.
కేసులో నిందితుడిగా తేలితే డైరెక్టర్ కిష్‌ని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు మాదాపూర్ డీసీపీ. కేసులో A1 గా గజ్జెల వివేకానంద్, A2గా అబ్బాస్ అలీ జాఫ్రీ, A3 నిర్భయ్ సింధి, A4 రఘుచరణ్, A5 కేధర్‌నాథ్, A6 సందీప్, A7 శ్వేత, A8 లిషి, A9 నీల్, A10 డైరెక్టర్ క్రిష్, A11 వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్, A12 మీర్జా వహిద్ బేగ్ ను చేర్చారు పోలీసులు. 41A సీఆర్పీసీ సెక్షన్ కింద కేసులు నమోదుచేశారు. తాజాగా 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.