Radhe Shyam: ‘రాధేశ్యామ్’తో ప్ర‌భాస్ టాలీవుడ్‌కు కొత్త దారి చూపించ‌బోతున్నాడా..?

చూస్తుండగానే జూన్లోకి ఎంటరైపొయ్యాం. సమ్మర్ సీజన్ ఎలాగూ జారిపోయింది. వాట్ నెక్స్ట్ అంటూ ఎలెర్ట్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీ. కొందరు పెద్ద సినిమాల నిర్మాతలైతే..

Radhe Shyam: రాధేశ్యామ్తో ప్ర‌భాస్ టాలీవుడ్‌కు కొత్త దారి చూపించ‌బోతున్నాడా..?
Radhe-Shyam

Updated on: Jun 07, 2021 | 8:42 PM

చూస్తుండగానే జూన్లోకి ఎంటరైపొయ్యాం. సమ్మర్ సీజన్ ఎలాగూ జారిపోయింది. వాట్ నెక్స్ట్ అంటూ ఎలెర్ట్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీ. కొందరు పెద్ద సినిమాల నిర్మాతలైతే.. అటోఇటో ఎటోవైపు జంప్ చెయ్యడమే బెటర్ అనే కాంప్రమైజేషన్ కి వచ్చేస్తున్నారు. మరీముఖ్యంగా… డార్లింగ్ లైనప్ మీదే ఇప్పుడు చాలామంది ఫోకస్. కొత్త సీజన్లో డిజిటల్ రిలీజ్ కి సీటీమార్ కొట్టి.. మిగతా ఇండస్ట్రీల్ని కూడా అప్రమత్తం చేశారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. ప్రోడక్ట్ ఎలా వున్నా.. స్టార్ హీరో సినిమాకి డిజిటల్ రూట్ బెటరేనంటూ తన రాధే మూవీకొచ్చిన వసూళ్లను సాక్ష్యంగా చూపెట్టారు సల్లూ భాయ్. బీటౌన్లో బాగా వర్కవుటైన ఈ పాలసీని ఇప్పుడు సౌత్ లో గ్రాండ్ గా ఇంట్రొడ్యూస్ చేయాలన్నది ఓటీటీ కంపెనీల స్ట్రాటజీ. సాహో తెరకెక్కక ముందే ప్రొడక్షన్ మొదలుపెట్టిన రాధేశ్యామ్ మూవీ.. ఇప్పటికే మూడేళ్ళపాటు ప్రభాస్ ఫాన్స్ ని వెయిటింగ్ లోనే ఉంచేసింది. ఇంతకంటే జాప్యాన్ని భరించే పరిస్థితి తమకూ లేదన్న క్లారిటీకొచ్చేసిందట రాధేశ్యాం టీమ్. ముందే అనౌన్స్ చేసిన జూలై 30 డేట్ ని తొందరపడి మార్చే ఆలోచన చేయొద్దని ప్రొడ్యూసర్లు డిసైడ్ అయ్యారట. జస్ట్ థియేటర్లు అలా ఓపెన్ అయితే చాలు.. ఆక్యుపెన్సీ లెక్కలతో పనిలేకుండా రాధేశ్యామ్ రిలీజ్ చేసి.. అదే టైంలో డిజిటల్ స్ట్రీమింగ్ కూడా షురూ చేయాలన్నది ఒక ప్లాన్.

ఇప్పటికే రాధేశ్యామ్ నిర్మాణ సంస్థలతో జీ5 టచ్ లో ఉంది. రాధే మూవీ తరహాలోనే పే ఫ‌ర్ వ్యూ పద్ధతిలో రాధేశ్యామ్ కి టిక్కెట్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఈ విధంగా డైహార్డ్ ఫ్యాన్స్ తో పాటు.. న్యూట్రల్ ఆడియెన్స్ ని కూడా రాధేశ్యామ్ కి కనెక్ట్ చేయాలన్నది ప్రైమరీ స్కెచ్. ఇది గనుక రియాలిటీలోకొస్తే.. ఇదే దారిలో దృశ్యం2, పాగల్, మాస్ట్రో లాంటి మరికొన్ని సినిమాలు కూడా నడిచినా నడవొచ్చు. సో.. అక్కడ రాధే.. ఇక్కడ రాధేశ్యామ్.. ఇండస్ట్రీకి ఒక దారి చూపించబోతున్నాయా? అన్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

Also Read: ఫుల్ స్వింగ్ లో మాస్ మహారాజా.. జులై లో కొత్తసినిమాను పట్టాలెక్కించనున్న రవితేజ..

రోజుకు ఐదారు వందల మంది సినీ కార్మికులకు వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము : చిరంజీవి