R. Narayanamurthy: సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..

|

Aug 12, 2021 | 11:12 AM

రైతు బంధుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని.. సినీ నిర్మాత, దర్శకుడు, హీరో ఆర్. నారాయణ మూర్తి అన్నారు.

R. Narayanamurthy: సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..
R Narayana Murthy
Follow us on

రైతు బంధుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని.. సినీ నిర్మాత, దర్శకుడు, హీరో ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన రైతన్న సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా.. మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా నేను స్పందిస్తున్నాను. అర్ధరాత్రి స్వాతంత్రం నుంచి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశాను. ప్రస్తుతం నా స్వీయ దర్శకత్వంలో రూపొందిన రైతన్న సినిమా ఈ నెల 14న విడుదల కాబోతుంది. అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలి. కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, కరంటు చట్టాలు రైతులకు వరాలు కావు, శాపాలుగా మారబోతున్నాయి. గత ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఓవైపు కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే రైతాంగం మాత్రం ధైర్యంగా వ్యవసాయం చేసి ఆహారం అందించింది. ఇలాంటి చట్టాలు వర్ధమాన దేశమైన భారతదేశానికి మంచివి కావు. ఇటీవల బీహార్‏లో మార్కెట్లు ఎత్తేస్తే గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిలలాడుతున్నారు. స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదని ఆర్ నారయణ మూర్తి అన్నారు.

బీహార్‏లో ఇప్పుడు రైతులు లేరు కేవలం రైతు కూలీలే మిగిలారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే ఈ దేశంలో కూడా రైతు కూలీలే మిగులుతారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు హజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ. రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. సమాజ హితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారు. సినిమా మాద్యమం ద్వారా  ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడు ఆర్ నారాయణ మూర్తి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

రైతులు, ప్రజలు, మీడియాతోపాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలి. ప్రజల హితాన్ని కోరే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితులలో ప్రజల కోసం, రైతుల హితం కాంక్షిస్తూ వస్తున్న ప్రభోధాత్మక సినిమా ఇది. ప్రజా ప్రయోజనం జరిగే కృషి ఏ రంగంలో జరిగినా మనం స్వాగతించాలి. ఒక శ్యాం బెనగల్, ఒక మృణాల్ సేన్ మాదిరిగా తెలుగులో నారాయణమూర్తి గారు సినిమాలను తీస్తున్నారు. ఈ నెల 14న విడుదలవుతున్న రైతన్న సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేవి అయినప్పడు స్పందించాల్సిన విపక్షాలు విస్మరిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకమని ప్రజలు ఒకసారి భావిస్తే వారే విపక్షపాత్ర పోషిస్తారు. అంశాలవారీగా హేతుబద్దతతో కూడిన విమర్శలను సమాజంలో అందరూ స్వాగతించాల్సిందే. కానీ ప్రస్తుత రాజకీయాలలో దురదృష్టవశాత్తు విమర్శ అంటే కువిమర్శ, తిట్లు, సంస్కారహీనత, రెచ్చగొట్టడం విమర్శలుగా మారాయి. ఈ ధోరణి మంచిది కాదని నిరంజన్ అభిప్రాయ పడ్డారు.

Also Read: Ester Anil: ఈ హీరోయిన్ సాహసానికి నెటిజన్లు ఫిదా.. గౌనులో వయ్యారాల చిన్నది.. లుక్ అదుర్స్..

Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. మాస్ కాంబో అదిరిపోవాల్సిందే అంటున్న అభిమానులు..