Pushpa Movie collection: తగ్గేదే లే అంటున్న పుష్ప సినిమా.. మొదటి రోజే భారీ కాసుల వర్షం..!

Pushpa Movie collection: సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంది. తాజాగా ఆకాశమే హద్దుగా పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది...

Pushpa Movie collection: తగ్గేదే లే అంటున్న పుష్ప సినిమా.. మొదటి రోజే భారీ కాసుల వర్షం..!

Edited By:

Updated on: Dec 18, 2021 | 5:22 PM

Pushpa Movie collection: సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంది. తాజాగా ఆకాశమే హద్దుగా పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బన్నీ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం.. సుకుమార్ కూడా రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ అంచనాలు పుష్ప సినిమాపై బాగా కనిపించాయి.

పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అన్ని భాషల్లో కలిపి రూ.70 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. పుష్ప సినిమాను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాత ఎర్నేని నవీన్ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో కూడా పుష్ప సినిమా రికార్డు తిరిగరాస్తోంది. బన్నీ నటనకు ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజే ఇంత కలెక్షన్‌ వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అదనపు షో పర్మిషన్ ఇవ్వడం మాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకొచ్చారు. వీక్‌ ఎండ్‌కు మంచి కలెకక్షన్‌ వస్తుందని భావిస్తున్నామని అన్నారు. బన్నీకి మలయాళంలో మంచి పేరుంది. ఈ సినిమా ఇంతకుముందు సినిమాల కంటే భారీ ఎత్తున వసూలు చేస్తుంది. ప్రపంచంలోనే తెలుగు ఆడియన్స్ లాంటి వాళ్ళు లేరు. ఈ సినిమాను ఇంత ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్5 ఫినాలేకు బడా స్టార్స్.. గెస్ట్‌లుగా రాబోతుంది వీళ్లేనా.?

Unstoppable with NBK: బాలయ్యతో సందడి చేయడానికి మాస్ మహారాజ్ రానున్నాడా..?