Rashmika: ఆ వార్తలు నిజం కావాలని కల కంటోన్న రష్మిక.. టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బ్యూటీ..

Rashmika Comments About Her Remuneration: అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నటి రష్మిక మందన. చేసినవి కొన్ని సినిమాలే అయిన బడా స్టార్‌ల సరసన నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ..

Rashmika: ఆ వార్తలు నిజం కావాలని కల కంటోన్న రష్మిక.. టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బ్యూటీ..

Updated on: Feb 20, 2021 | 12:02 PM

Rashmika Comments About Her Remuneration: అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నటి రష్మిక మందన. చేసినవి కొన్ని సినిమాలే అయిన బడా స్టార్‌ల సరసన నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళుతోంది.

కన్నడలో కెరీర్‌ మొదలు పెట్టిన రష్మిక.. టాలీవుడ్‌ ద్వారానే టాప్‌ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఏకంగా బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయితే రష్మిక బాలీవుడ్‌లో నటించే సినిమా కోసం ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటోందని ఓ వార్త కొన్ని రోజుల క్రితం తెగ వైరల్‌గా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తపై స్పందించిన ఈ అందాల తార.. ‘నేను అంత మొత్తం పారితోషకం తీసుకుంటున్నానని వార్తలు వస్తున్నాయి. వాటిని నేను కూడా విన్నాను. ఆ వార్తల్లో వస్తున్నట్లు అంత మొత్తం పారితోషికం తీసుకోవాలన్నది నా కల. అది నిజమైతే బాగుండేదని.. ఆ వార్తలు వట్టి పుకార్లేనని చెప్పకనే చెప్పిందీ బ్యూటీ. ఇక ఇదే ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ.. ‘తెలుగు పరిశ్రమ నాకు ఓ పాఠశాల లాంటిది. ఇక్కడే నటనకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇక కన్నడ సినిమాను నా సొంత ఇంటిలా భావిస్తా’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. రష్మిక ప్రస్తుతం.. ‘పుష్ప’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’తో పాటు.. హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: Play Back Telugu Movie: దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో రాబోతున్న ‘ప్లేబ్యాక్’.. రిలీజ్ ఎప్పుడంటే..?