Pushpa: పుష్ప 2లో కేశవ పాత్ర ఉన్నట్టా..? లేనట్టా..? రిలీజ్ కూడా ఆలస్యంకానుందా..

'పుష్ప 2' సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటుడు అల్లు అర్జున్ నటించారు . అలాగే ఈ సినిమాలో పుష్పరాజ్ స్నేహితుడు కేశవ్ పాత్రలో జగదీష్ ప్రతాప్ భండారి నటించాడు. యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ జైలుకెళ్లడంతో చిత్రబృందంలో ఆందోళన పెరిగింది.

Pushpa: పుష్ప 2లో కేశవ పాత్ర ఉన్నట్టా..? లేనట్టా..? రిలీజ్ కూడా ఆలస్యంకానుందా..
Pushpa 2

Updated on: Dec 21, 2023 | 8:24 PM

పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటుడు అల్లు అర్జున్ నటించారు . అలాగే ఈ సినిమాలో పుష్పరాజ్ స్నేహితుడు కేశవ్ పాత్రలో జగదీష్ ప్రతాప్ భండారి నటించాడు. యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ జైలుకెళ్లడంతో చిత్రబృందంలో ఆందోళన పెరిగింది. మైత్రి మూవీ మేకర్స్ తమ పరపతిని ఉపయోగించి అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అయినా ప్రయోజనం లేదని అంటున్నారు.

జగదీష్ వద్ద ఓ యువతి ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయి. దీన్ని ఉంచుకుని జగదీష్ బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే సమయంలో జగదీష్ పేరును రాసిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జైలుకు పంపారు. కేసు సీరియస్‌ కావడంతో జగదీష్‌కు బెయిల్‌ లభించలేదు. ఆ పాత్ర లేకుండా కథను ఎలా కొనసాగించాలా అని టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.

‘పుష్ప’లో కేశవ్ పాత్ర అందరినీ ఆకర్షించింది. కేశవ్ ఎప్పుడూ పుష్పరాజ్‌తోనే కనిపిస్తాడు. రెండో భాగంలో కూడా ఈ పాత్రనే కొనసాగించాలని అనుకున్నారు దర్శకుడు సుకుమార్. రెండో భాగంలో ఈ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. అయితే జగదీష్ జైలుకు వెళ్లడంతో .. అది నిర్మాణ సంస్థకు తలనొప్పిగా మారింది. ఆ పాత్ర కథ నుంచి తీసేయడం కూడా కుదరడం లేదని తెలుస్తోంది. జగదీష్‌ని బయటకు తీసుకొచ్చేందుకు మైత్రి మూవీ మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ వాయిదా పడటంతో  సినిమా విడుదల పై సస్పెన్స్ నెలకొంది. ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. కలెక్షన్స్ పరంగా సక్సెస్ అయ్యింది. దాంతో ‘పుష్ప 2’ చిత్రానికి హైప్ పెరిగింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ తోపాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.