Pushpa 2: యానిమల్ కంటే వైల్డ్.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతో తెల్సా.? బాబోయ్.. తగ్గేదేలే

ఇక పాజిటివ్ టాక్ కూడా వచ్చిందంటే మాత్రం 2000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా పుష్ప 2 రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ అయితే భారీగానే జరుగుతుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 3 గంటల 21 నిమిషాలు ఉండబోతుందని తెలుస్తుంది.

Pushpa 2: యానిమల్ కంటే వైల్డ్.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతో తెల్సా.? బాబోయ్.. తగ్గేదేలే
Pushpa The Rule Movie
Follow us
Praveen Vadla

| Edited By: Ravi Kiran

Updated on: Nov 27, 2024 | 11:28 AM

కొన్ని సినిమాలుంటాయి.. విడుదలకు ముందే అవి హిట్ అని అంతా ఫిక్సైపోయి ఉంటారు. బాహుబలి 2, కేజియఫ్ 2 లాంటి సినిమాలు అలాంటి జాబితాలోకి వస్తాయి. రిలీజ్‌కు ముందు ఈ సినిమాలపై ఇంత కూడా నెగిటివ్ టాక్ లేదు. రిలీజ్ అయిన తర్వాత నల్లేరుపై నడకలా వసూళ్లు కూడా వచ్చాయి. ఒక్కో సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్ కూడా అంతే. కాస్త మిక్డ్స్ టాక్ వచ్చినా కూడా 1300 కోట్లు వసూలు చేసింది. కల్కి, దేవర లాంటి సినిమాలు కూడా కలెక్షన్ల సునామి క్రియేట్ చేసాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2పై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. ఈ సినిమా టాక్‌తో పనిలేకుండానే 1000 కోట్లు ఈజీగా వసూలు చేసేలా కనిపిస్తుంది.

ఇక పాజిటివ్ టాక్ కూడా వచ్చిందంటే మాత్రం 2000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా పుష్ప 2 రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ అయితే భారీగానే జరుగుతుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 3 గంటల 21 నిమిషాలు ఉండబోతుందని తెలుస్తుంది. ఈ విషయంలో సుకుమార్ మొండిపట్టు పట్టుకున్నాడని.. కచ్చితంగా ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరని నమ్ముతున్నట్లు తెలుస్తుంది. సినిమా కథ అంత ఉంటుంది కాబట్టి మధ్యలో కట్టింగ్స్ ఏవీ లేకుండానే చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నిజంగానే పుష్ప 2 నిడివి 3.21 గంటలు ఉంటే మాత్రం ఒకింత రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత రన్ టైమ్ ఉండటం ఎంత ప్లస్ అవుతుందో.. అంతే మైనస్ కూడా అవుతుంది. అయితే చాలాసార్లు 3 గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న సినిమాలు బాగా ఆడాయి.

అప్పట్లో దానవీరశూరకర్ణ 3.46 గంటలతో వచ్చింది.. ఆ తర్వాత లవకుశ 3.28 గంటలు.. పాండవ వనవాసము 3.18 గంటలు.. పాతాళ భైరవి 3.15 గంటలతో వచ్చి సంచలనం సృష్టించాయి. రీసెంట్‌గా యానిమల్ సినిమా 3.21 గంటలతో వచ్చి 900 కోట్లు వసూలు చేసింది. అర్జున్ రెడ్డి, ఆదిపురుష్, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు కూడా 3 గంటల నిడివితోనే వచ్చాయి. అందులో ఆదిపురుష్ నిరాశ పరిచినా.. మిగిలిన రెండూ చరిత్ర సృష్టించాయి. మొత్తానికి 3 గంటల నిడివి సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో అంతే మైనస్ కూడా అవుతుంది. మరి ఇది పుష్ప 2కు ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?