తెలంగాణలో పుష్ప2ని డిసెంబర్ 4 రాత్రి 9.30 నుంచి థియేటర్లలో చూడొచ్చు. బెనిఫిట్ షోలకు టికెట్ ధర 800 రూపాయలు అదనంగా చెల్లించాలి. 9.30 షోలు పూర్తి కాగానే అర్ధరాత్రి 1 గంట షోకు కూడా పర్మిషన్ వచ్చింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 200 రూపాయలు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 105 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు అదనంగా చెల్లించాలి.
డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 20 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 50 రూపాయలు పెంచుకోవచ్చని జీవో వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకి పైగా థియేటర్లలో విడుదలవుతోంది పుష్ప2. సినీడబ్స్ యాప్ సాయంతో ఏ భాషలోనైనా సినిమాను చూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆరు భాషల్లో విడుదలవుతోంది పుష్ప ది రూల్.
మూడు గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో సాగుతుంది పుష్ప2. ప్రీ రిలీజ్ టైమ్‌లోనే వెయ్యికోట్లకు పైగా బిజినెస్ చేసింది. క్లోజింగ్ టైమ్‌కి 1800 నుంచి రెండు వేల కోట్ల రూపాయలు గ్యారంటీగా వసూలవుతాయని ట్రేడ్ వర్గాల్లో అంచనాలున్నాయి. ప్రమోషన్ల పరంగా, వ్యూస్, లైక్స్ పరంగా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది పుష్ప2. రీసెంట్ టైమ్స్ లో ఏ భారీ సినిమాకూ లేనంతగా.. ముందు రోజు రాత్రి నుంచే బెనిఫిట్ షోలకు పర్మిషన్లు తెచ్చుకోవడం కూడా గ్రేట్ అంటున్నారు విశ్లేషకులు.
నెవర్ బిఫోర్ అనే మాటకు సిసలైన మీనింగ్ ఏంటో తెలియాలంటే పుష్ప రిలీజ్‌ని చూస్తే చాలు అనే మాట స్ప్రెడ్ అవుతోంది. కంటెంట్ కూడా ఇంతే జోరుగా ఉంటే… ఇండియన్ సినిమా బాక్సాఫీస్ షేక్ కావడం గ్యారంటీ అనే డిస్కషన్ షురూ అయింది. దాదాపు రెండు వారాల నుంచే పుష్ప2 హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్ నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతూ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.