
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మువీ గతేడాది డిసెంబర్ 5 విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మువీ వచ్చి 2 నెలలు దాటిని ఇంకా దేశ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో పుష్ప మువీలో అల్లు అర్జున్ మేనరిజం జనాలను తెగ ఆకట్టుకుంది. అంతేనా.. ఈ మువీలోని పాటలు, డైలాగులు జనాలు నిత్య జీవితంలోనూ తెగ వాడేస్తున్నారు. ఈ క్రేజ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళాలో ఉన్నట్లుంటి పుష్పరాజ్ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చపరిచాడు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అక్కడ పుణ్య స్నానాలు అచరిస్తున్న సంగతి తెలిసిందే. భక్తులతోపాటు అక్కడికి వచ్చిన వింత వింత భాభాలు, సాధువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పుష్ప గెటప్‌లో ఉన్న అల్లు అర్జున్ అభిమాని ఒకరు ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు.
మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన మహారాష్ట్రకు చెందిన పుష్ప 2లోని అల్లు అర్జున్ సిగ్నేచర్ లుక్‌లో కనిపించాడు. అంతేనా ఆ మువీలోని పలు డైలాగ్‌లు చెప్పి కుంభమేళాలోని భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పోలీస్ సిబ్బందిని అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పుష్ప మాదిరి హెయిర్ స్టైల్, డ్రెస్ వేసుకున్న సదరు వ్యక్తి.. పుష్ప మాదిరి అభినయిస్తూ డైలాగ్‌లు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది.
🚨A devoted fan of #AlluArjun from Maharashtra took a holy dip at the Sangam during the Maha Kumbh in Prayagraj.
His enthusiasm and unique style became a talking point at the event.#PrayagrajMahakumbh2025 #Pushpa2TheRule #AlluArjunFan #MahaKumbh2025 #Pushpa2 pic.twitter.com/K3nd3hVBmf
— TollywoodRulz (@TollywoodRulz) February 6, 2025
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మువీ విడుదలై 50 రోజులు ముగిసిన సందర్భంగా జనవరి 23న చిత్రబృందం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. అందులో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్..’50 ఐకానిక్ డేస్ ఆఫ్ పుష్ప 2: ది రూల్ థియేటర్లలో హిట్ కొట్టి రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. రీలోడెడ్ వెర్షన్‌ను ఆస్వాదించడానికి ఈరోజే మీ టిక్కెట్లను బుక్ చేసుకోండి’ అంటూ ప్రకటించింది. అయితే పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్‌ను జనవరి 11 విడుదల చేయాల్సి ఉండగా.. కాస్త జాప్యం నెలకొంది. దీంతో జనవరి 17న అదనంగా 20 నిమిషాల ఫుటేజ్‌తో ఈ మువీని విడుదల చేశారు. ఈ మువీ ఒక్క హిందీ వెర్షన్‌లోనే ఏకంగా రూ. 800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లను అధిగమించి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.