Pushpa2: అప్పుడే మొదలైన పుష్ప అరాచకం.. మాములు ‘ఫైర్‌’ కాదు భయ్యో..

|

Nov 19, 2024 | 11:36 AM

ఒక్క తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ పుష్ప2 సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ సినిమా ఎప్పడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. కాగా పుష్ప ఇంకా విడుదలవ్వకముందే రికార్డులను తిరగడం రాయడం మొదలు పెట్టింది. ప్రీసేల్‌ బిజినెస్‌లో సరికొత్త బెంచ్‌ మార్క్‌ను సృష్టించింది..

Pushpa2: అప్పుడే మొదలైన పుష్ప అరాచకం.. మాములు ఫైర్‌ కాదు భయ్యో..
అన్నిటినీ కొట్టేయడానికి మన పుష్పరాజ్‌ రెడీ అవుతున్నారన్నది మైత్రీ మూవీస్‌ కాంపౌండ్‌లో స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న మాట. ఇంతకీ ఇప్పుడు అర్జంటుగా పుష్పరాజ్‌ బద్ధలు కొట్టాల్సిన రికార్డు ఏంటంటారా?
Follow us on

ఇటీవల విడుదలైన పుష్ప 2 ట్రైలర్‌లో వచ్చిన.. ‘పుష్ప అంటే మాములు ఫైర్‌ కాదు.. వైల్డ్‌ ఫైర్‌’ అనే డైలాగ్‌ వినే ఉంటాం. అయితే పుష్ప సృష్టిస్తోన్న అరాచకం చూస్తుంటే ఇది నిజంగా నిజమే అనిపిస్తోంది. డిసెంబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప.. విడుదలకు ముందే రికార్డులను తిరగరాయడం మొదలు పెడుతోంది. ఇప్పటికే ట్రైలర్‌తో సరికొత్త రికార్డులను సృష్టిస్తోన్న పుష్ప తాజాగా ప్రీసేల్‌ బుకింగ్స్‌లో సరికొత్త బెంచ్‌ మార్క్‌లను సెట్‌ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు.

ఓవర్‌సీస్‌లో మార్కెట్లో ప్రీసేల్‌ మొదలుకాగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా ‘పుష్ప2’ వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. విదేశాల్లో ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్‌ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరిచేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్‌లో మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసెల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ డాలర్లకు చేరుకున్న మూవీగా పుష్ప2 నిలిచింది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారింగా ప్రకటించింది. ‘మరో రోజు.. మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్‌ వద్ద పుష్పరాజ్‌ హవా కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. పుష్ప 2 సినిమాను ఒక్క అమెరికాలోనే ఏకంగా 3200 షోలను ప్రదర్శించనున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా పుష్ప విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తుండగా, విడుదల తర్వాత మరెన్ని సంచనాలకు తెర తీస్తుందో అని ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.

పుష్ప2 ట్రైలర్..

ఇదిలా ఉంటే పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ భారీ విజయాన్ని అందుకోవడంతో సహజంగానే పుష్ప2పై భారీ అంచనాలు పెరిగాయి. అందుకు అనుగుణంగానే సుకుమార్‌ సీక్వెల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఎర్రచందనం సిండికేట్‌కు నాయకుడిగా ఎదిగిన తర్వాత పుష్ప జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. లాంటి అంశాలను ఇందులో చూపించనున్నారు. మొదటి పార్ట్‌కు మించి రెండో పార్ట్‌ ఉండనుందని ఇప్పటికే పలుసార్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…