Puri Jagannadh: పూరి ఈజ్ బ్యాక్.. విజయ్ సేతుపతి లుక్, టైటిల్ అదిరిపోయాయిగా

ప్రస్తుతం పూరిజగన్నాథ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

Puri Jagannadh: పూరి ఈజ్ బ్యాక్.. విజయ్ సేతుపతి లుక్, టైటిల్ అదిరిపోయాయిగా
Vijay Sethupathi

Updated on: Jan 16, 2026 | 12:58 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. చాలా కాలంగా సక్సెస్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు పూరిజగన్నాథ్. అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న పూరిజగన్నాథ్ ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ చూశారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా సినిమా మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలు స్లమ్ డాగ్ అనే ఆసక్తికర టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ఆసక్తికరంగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా కనిపిస్తాడని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. నేడు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈమేరకు మేకర్స్ ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేశారు. సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. మురికి వాడాల నుంచి ఎవరు ఊహించని, తట్టుకోలేని తుఫాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది అంటూ పోస్టర్ విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

స్లమ్ డాగ్ అనే టైటిల్ తో పాటు 33 టెంపుల్ రోడ్డు అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ ను విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో టబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమాతో పూరిజగన్నాథ్ ఖచ్చితంగా హిట్ అందుకుంటారని అంటున్నారు అభిమానులు. విజయ్ సేతుపతి హీరోగా డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..