Puneeth Rajkumar: ‘మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా’.. కంఠీరవ కిక్కిరిసింది ఇందుకే

అప్పుగా అశేష కన్నడ ప్రేక్షకాదరణ... చేసిన సినిమాలు- 29..  జీవించింది కేవలం- 46 ఏళ్లు.. యాక్టర్- ప్లే బ్యాక్ సింగర్...టెలివిజన్ ప్రెజంటర్.

Puneeth Rajkumar: మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ సాగదా.. కంఠీరవ కిక్కిరిసింది ఇందుకే
Puneeth Rajkumar

Updated on: Oct 30, 2021 | 7:36 PM

అప్పుగా అశేష కన్నడ ప్రేక్షకాదరణ… చేసిన సినిమాలు- 29..  జీవించింది కేవలం- 46 ఏళ్లు.. యాక్టర్- ప్లే బ్యాక్ సింగర్…టెలివిజన్ ప్రెజంటర్- ప్రొడ్యూసర్ గా ఎన్నో సినీ సేవలు. 90 శాతం సక్సెస్ రేట్.. 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో. ఇవన్నీ నాణేనికి ఓవైపు మాత్రమే. ఇవే కాదు.. పునీత్ రాజ్ కుమార్ అంటే 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు.. తన తోటి నటీ నటులకూ పునీత్ కూ ఇదే తేడా. ఇదే ఆయన్ను అందనంత ఎత్తున నిలబెట్టింది.

అప్పూతో కెరీర్ స్టార్ట్ చేసిన పునీత్ రాజ్ కుమార్.. నటసార్వభౌమగా.. తండ్రి నటవారసత్వం నిరూపిస్తూనే.. రాజకుమారుడిగా.. ఒక వెలుగు వెలుగుతూనే.. సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. తనకు దేవుడు అడక్కుండానే అన్నీ ఇచ్చాడు. కానీ అందరూ తనలా అదృష్టవంతులు కారు. తన చుట్టూ ఎందరో నిర్భాగ్యులున్నారు. వారికి అడుగడుగునా ఆపన్న హస్తం అందించాలి.. ఇదే పునీత్ తరచూ తన వాళ్లతో అనే మాట. అందుకే తండ్రి ఇచ్చిన పునీతమైన జన్మ- సొంత రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన కనబరిచారు.. పునీత్ రాజ్ కుమార్. కన్నడనాట ఎన్నో సేవా కార్యక్రమాలను తన తండ్రి పేరిట చేస్తూ వచ్చారు. అందుకే ఇంతటి- సినిమాలకు అతీతమైన ఫాలోయింగ్..

పునీత్ మరణ వార్త చెప్పడానికి ఒక కన్నడ టీవీ యాంకర్ అయితే బోరు బోరున విలపించిన దృశ్యం నెట్టింట ఎంత వైరల్ అయ్యిందో చూశాం. ఆయన చనిపోయే ముందు చెప్పిన నాలుగు మాటలే ఇపుడు అభిమానులకు ఓదార్పు వచనాలు. పునీత్ ది ఎంత గొప్ప మరణమంటే.. ఆయన మరణ వార్త చెప్పడానికి కర్ణాటక ప్రభుత్వమే భయపడిపోయేంత. పరీక్షలు రాసేవాళ్లను సైతం ఇళ్లకు పంపించేసి.. స్కూళ్లకు సెలవులిచ్చేసి.. కేంద్ర హోంశాఖను అడిగి కేంద్ర బలగాలను పంపించమని కోరి.. ఆ తర్వాతగానీ విషాద వార్త ప్రకటించలేదు. అంతటి పాపులర్ హ్యూమన్ బీయింగ్ పునీత్ రాజ్ కుమార్. కళా రంగానికి సేవ చేయడంతో పాటు.. ఎంతో మంది గుండెల్లో రియల్ హీరోగా నిలిచిన పునీత్ రాజ్‌కుమార్‌కు టీవీ9 అశ్రునివాళి.

Also Read: పునీత్ మరణ వార్త చదువుతూ లైవ్‌లో గుండెలవిసేలా రోదించిన యాంకర్… Watch Video

పెళ్లి రోజున భర్తతో ఉన్న అందమైన ఫోటో షేర్ చేసిన చందమామ కాజల్