Puneet Rajkumar Birthday: పునీత్ ఇక లేడని ఇప్పటికీ ఆమెకు తెలియదు..  మరణవార్తను రహస్యంగా ఉంచిన కుటుంబసభ్యులు..

ఆమెకు తెలియదు తన మేనల్లుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) ఇక లేడని.. తన వద్దకు ఇక ఎప్పటికీ రాలేడు అనే విషయం తెలియక ఇంకా ఎదురుచూస్తుంది.

Puneet Rajkumar Birthday: పునీత్ ఇక లేడని ఇప్పటికీ ఆమెకు తెలియదు..  మరణవార్తను రహస్యంగా ఉంచిన కుటుంబసభ్యులు..
Puneeth

Edited By: Rajeev Rayala

Updated on: Mar 17, 2022 | 7:56 PM

ఆమెకు తెలియదు తన మేనల్లుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) ఇక లేడని.. తన వద్దకు ఇక ఎప్పటికీ రాలేడు అనే విషయం తెలియక ఇంకా ఎదురుచూస్తుంది. అప్పు ఎప్పుడొస్తాడు అని అడిగిన ప్రతిసారి కుటుంబసభ్యుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.. రాలేడని చెప్పడానికి వాళ్ల పెదాలు సహకరించడం లేదు.. అవుట్ డోర్ షూటింగ్‏లో ఉన్నాడని.. త్వరలోనే వచ్చేస్తాడని చెబుతూ వస్తున్నారు. ఆమె కోసం పునీత్ సినిమాలను చూపించగా.. స్క్రీన్ పై తన మేనల్లుడిని చూసి మురిసిపోతుంది అప్పు మేనత్త నాగమ్మ.. అంతా సినిమా స్టోరీలాగే అనిపిస్తుంది కదూ.. కానీ ఇదే నిజం.. పునీత్ మరణవార్త ఇంకా అతని మేనత్త నాగమ్మకు తెలియదని అప్పు కుటుంబసభ్యులు తెలిపారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇంకా కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. 46 ఏళ్ల వయసులోనే పునీత్ గుండెపోటుతో చనిపోవడాన్ని అతని కుటుంబసభ్యులతోపాటు.. ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అప్పు మరణాన్ని తట్టుకోలేక పలువురు అభిమానులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. మార్చి 17న పునీత్ జయంతి.

అయితే పునీత్ మరణ వార్త ఇంకా అతని మేనత్త నాగమ్మకు తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు.. 90 ఏళ్ల నాగమ్మ..థెస్పియన్ డాక్టర్ రాజ్ కుమార్ సోదరి. వీరి కుటుంబంలో ఆమెనే పెద్దది.. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం.. రాజ్ కుమార్ పిల్లలను చిన్నతనంలో ఆమెనే చూసుకునేవారు. పునీత్ ఎక్కువగా గాజనూర్‍లోని వాళ్ల పూర్వీకుల ఇంటిలో ఆమెను కలుసుకునేవారు. పునీత్ మరణవార్తను ఆమె దగ్గర దాచి పెట్టారు. అప్పు కోసం అడిగితే అతను అవుట్ డోర్ షూటింగ్ ఉన్నాడని చెబుతున్నారు. గతంలో పునీత్ అన్నయ్య రాజ్ కుమార్‏కు గుండె పోటు రావడంతో ఆమె తట్టుకోలేకపోయారు. షాక్‏కు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పుడు పునీత్ మరణవార్త తెలిస్తే ఆమె తట్టుకోలేదని.. అందుకే ఆమెకు ఈ విషయం చెప్పలేదని.. వాళ్ల ఇంట్లో పునీత్ ఫోటోలకు పూలమాలలు వేయలేదని.. చుట్టుపక్కల వాళ్లు లేదా గ్రామస్తులు ఇంటికి వచ్చినా పునీత్ గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నామని తెలిపారు.

Also Read: The Kashmir Files: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను మినహాయించండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..

Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..

Ashoka Vanamlo Arjuna Kalyanam: “అశోకవనంలో అర్జున కళ్యాణం” రిలీజ్ అయ్యేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..