Puneeth Rajkumar: నేడు అప్పు 50 పుట్టిన రోజు.. నీవు లేవు.. నీదారిని విడవలేం అంటున్న ఫ్యాన్స్.. జయంతి వేడుకల్లో సామాజిక కార్యక్రమాల నిర్వాహణ..

సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. కొంతమంది మాత్రమే మరణించీ చిరంజీవులుగా చరిత్రలో, ప్రజల మనస్సులో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తుల్లో దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఒకరు. అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ జయంతిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు అప్పు 50వ పుట్టినరోజు. ఈ రోజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. కనుక పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల స్థలాన్ని అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు సందర్శిస్తున్నారు. అనేక సామాజిక కార్యక్రమములని నిర్వహిస్తున్నారు.

Puneeth Rajkumar: నేడు అప్పు 50 పుట్టిన రోజు.. నీవు లేవు.. నీదారిని విడవలేం అంటున్న ఫ్యాన్స్.. జయంతి వేడుకల్లో సామాజిక కార్యక్రమాల నిర్వాహణ..
Puneeth Rajkumar 50th Birthday

Updated on: Mar 17, 2025 | 9:34 AM

కన్నడ ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్ కుమార్ జయంతి నేడు. ఆయన జీవించి ఉండి ఉంటే మార్చి 17 తన 50వ పుట్టినరోజును ఫ్యామిలీ, ఫ్యాన్స్ మధ్య ఘనంగా జరుపుకునేవాడు. అయితే అప్పు భౌతికంగా మరణించాడు.. మా మనసులో చిరంజీవి అంటూ అభిమానులు అప్పు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా అనేక రకాల సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నతలే. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అప్పు అభిమానులు అన్నదానం, రక్తదానం, నేత్రదాన నమోదు వంటి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పునీత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.

కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ పరిశ్రమ అభివృద్ధి కోసం చేసిన కృషిని మర్చిపోలేమని అంటున్నారు. తండ్రి రాజ్ కుమార్ సినిమాలో బాల నటుడిగా వెండి తెరపై అడుగు పెట్టి అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆయన హీరోగా రాణించాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్ లో అప్పుకు సాటి మరొకరు లేరు. అదేవిధంగా పునీత్ రాజ్ కుమార్ వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించి తన అభిమానులకు ఒక రోల్ మోడల్ గా నిలిచారు.

పునీత్ రాజ్ కుమార్ 50వ పుట్టినరోజు. దీంతో పునీత్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘అప్పు’ తిరిగి విడుదల అయింది. గత శుక్రవారం (మార్చి 14) తిరిగి విడుదలైన ‘అప్పు’ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇలా చేయడం ద్వారా అభిమానులు అప్పు పట్ల తమకున్న అభిమానం ఎప్పటికీ తగ్గదని నిరూపించారు. ఈ సినిమా చాలా చోట్ల హౌస్‌ఫుల్ అవుతుంది. అంతేకాదు రమ్య, షర్మిలా మాండ్రే, సంతోష్ ఆనంద్ రామ్, రక్షిత ప్రేమ్, యువ రాజ్ కుమార్ సహా అనేక మంది ఈ సినిమా చూశారు.

ఇవి కూడా చదవండి

పునీత్ రాజ్ కుమార్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి నిర్మాత.. మంచి వ్యాపారవేత్త. ‘పీఆర్‌కే ప్రొడక్షన్స్’ ద్వారా మంచి చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ పనిని ఇప్పుడు అశ్విని పునీత్ రాజ్ కుమార్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు అప్పు పుట్టినరోజు సందర్భంగా నివాళులు అర్పించడానికి చాలా మంది ఆయన సమాధిని సందర్శిస్తున్నారు. డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబం కూడా సమాధి స్థలాన్ని సందర్శిస్తారు.

పునీత్ రాజ్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన మంచి వ్యాపారవేత్త కూడా. వ్యాపారం మీద మంచి పట్టు ఉందని చెప్పవచ్చు. హీరోగా మారక ముందు గ్రానైట్ వ్యాపారం చేసేవాడు. అయితే కొడుకు చేస్తున్న వ్యాపారం తండ్రి రాజ్ కుమార్ నచ్చలేదని.. వ్యాపారం వద్దని అభ్యర్థించాడని తెలుస్తోంది. చిన్న వయసులోనే గుండె నొప్పితో హటాత్తుగా మరణించాడు. నీవు లేవు, నీ స్మృతులను మరణం అంటున్నారు అభిమానులు. పునీత్ చేసిన సామాజిక కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..