విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప‘ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయినా అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేశారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.
డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపథ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలనివుందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం అని అన్నారు సురేష్ బాబు.
అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చారిటీల కోసం పని చేస్తున్నాను. విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కోసం ఎక్కువ సమయం పని చేస్తున్నాను. పిల్లల్ని చదివిస్తే దానికి కంటే మెరుగైన అభివృద్ధి ఈ దేశానికి మరొకటి వుండదని భావిస్తాను. అలాగే పర్యావరణం కోసం కూడా కొంత పని చేస్తున్నాను. ఇటివల ఒక షో కి వెళ్ళినపుడు సినిమా పరిశ్రమలో ఓ టెక్నిషియన్ కి కొంత డబ్బు చారిటీ గా ఇచ్చాం. అయితే అన్ని విభాగాలకు అసోషియేసన్స్ వున్నాయి. సంక్షేమం కంటే అందరిలో స్కిల్ ని ఎలా పెంపొందించాలనే అంశంపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుందని భావిస్తాను. విద్య, తగిన నైపుణ్యం మెరుగైన జీవితాన్ని ఇస్తాయి అని అన్నారు సురేష్ బాబు.