
టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ రీసెంట్ గా డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.. టాలీవుడ్ లో మేము తెలుగు వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతాం అని ఎస్‌కెఎన్ అన్నారు. అంతే కాదు దానికి కారణం కూడా ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది అని అన్నారు. ఇక నుంచి నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగురాని హీరోయిన్లని తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఎస్‌కేఎన్ తెలిపారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా తన వ్యాఖ్యల పై క్లారిటీ ఇచ్చారు ఎస్కేఎన్. ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగు అమ్మాయిలని ప్రోత్సహించింది తానే అని.. తాను జోక్ గా చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవద్దని తెలిపారు. అలాగే రాబోయే తన సినిమాల్లోనూ తెలుగు అమ్మాయిలే నటిస్తున్నారని చెప్పుకొచ్చారు నిర్మాత ఎస్‌కేఎన్