Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద పెద్ద హీరోలతో పని చేశా.. కష్టకాలంలో ఒక్కరు కూడా పట్టించుకోలేదు..: రమేష్ బాబు

టాలీవుడ్ నిర్మాతల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ సింగనమల రమేష్ బాబు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు రమేష్ బాబు. కానీ ఆయన అనుకోని వివాదాల్లో చిక్కుకున్నారు. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి 12 కోట్లు స్వాహా చేశారని రమేష్ బాబుపై కేసు నమోదైంది పోలీసులు ఆయనను అరెస్ట్ కూడా చేశారు.

పెద్ద పెద్ద హీరోలతో పని చేశా.. కష్టకాలంలో ఒక్కరు కూడా పట్టించుకోలేదు..: రమేష్ బాబు
Ramesh Babu
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2025 | 1:46 PM

Share

టాలీవుడ్ నిర్మాత రమేష్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. ఇద్దరు పెద్ద హీరోల సినిమా వల్ల తనకు రూ. 100 కోట్లు నష్టం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి 12 కోట్లు స్వాహా చేశారని రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో 78 రోజులు జైల్లో ఉన్నాడు ఈయన.. జనవరి 31 2025న ఎలాంటి సాక్షాధారాలు లేకపోవడంతో రమేష్ బాబును నిర్దోషిగా కోర్టు తేల్చింది. అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు రమేష్ బాబు.

ఈ ప్రెస్ మీట్ లో రమేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా మీద అబద్ధపు కేసులు వేశారు.. 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశాను ఇప్పుడు విజయం సాధించాను అని అన్నారు రమేష్ బాబు. అబద్ధపు కేసులు ఎప్పుడూ నిలబడవు.. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ల మీద ఇకపై న్యాయ పోరాటం చేస్తాను.. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేయలేదు కనీసం పలకరించిన పాపాన పోలేదు..

ఎంత పెద్ద హీరోలతో పని చేసినా కూడా ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు అని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. పులి, ఖలేజా సినిమాలతో నాకు 100 కోట్ల నష్టం వచ్చింది..ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయి అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి