Megastar Chiranjeevi: పార్టీ కోసం చిరు ఆస్తులు అమ్మేశారు.. ప్రజారాజ్యం బాధ.. ఆవేశమే జనసేన..

|

Oct 09, 2022 | 1:02 PM

చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.. జనసేన గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు నిర్మాత ఎన్వీ ప్రసాద్.

Megastar Chiranjeevi: పార్టీ కోసం చిరు ఆస్తులు అమ్మేశారు.. ప్రజారాజ్యం బాధ.. ఆవేశమే జనసేన..
Nv Prasad, Megastar Chiranj
Follow us on

మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం గాడ్ ఫాదర్. యంగ్ హీరో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్రలో అల్లాడించేశాడు. అలాగే జర్నలిస్ట్‏గా పూరి జగన్నాథ్.. అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం తర్వాత అన్నయ్య ఫ్యాన్స్‏కు ఫుల్ మీల్స్ అందించారు డైరెక్టర్ మోహన్ రాజా. ఒరిజినల్ చిత్రం లూసీఫర్‏కు సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల నెటివిటికి కనెక్ట్ అయ్యేలా గాడ్ ఫాదర్ తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి భారీగా రెప్సాన్స్ వస్తోంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతున్న ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో చిరుతోపాటు చిత్రయూనిట్ కూడా పాల్గోంది. అయితే ఈ కార్యక్రమంలో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.. జనసేన గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు నిర్మాత ఎన్వీ ప్రసాద్.

ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ” మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎన్నికలు మొత్తం మేము దగ్గరుండి చూసుకున్నాము. ఆయన తిరుపతిలో పోటీ చేస్తే అక్కడి లోకల్ లీడర్లతో సమన్వయం చేశాము. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు.. ఇప్పటి వరకు ఆయనకు కూడా తెలియని విషయం ఇప్పుడు చెబుతున్నాను. చాలా మంది ఆయన అమ్ముడు పోయారని అంటున్నారు. కానీ మద్రాసు ల్యాబ్ పక్కన ఉన్న కృష్ణ గార్డెన్ ప్రాపర్టీ అమ్మి ఆయన పార్టీ క్లోజ్ చేసే రోజు అప్పులు తీర్చారు. అంతపెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి చిరు. ఈ విషయం ప్రపంచానికి తెలియదు. కానీ ఇప్పుడు ఆయన గురించి ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. ఏది పడితే అది రాస్తున్నారు. ధైర్యం ఉంటే నా గురించి రాయమని చెప్పండి. ఏ ఒక్కరు ముందుకు రారు.

ఇవి కూడా చదవండి

కానీ చిరంజీవి గురించి మాత్రం ఇష్టం వచ్చినట్లు రాసేస్తారు. ఎందుకంటే ఆయన స్పెషల్ పర్సన్ కాబట్టి. ముఖ్యంగా కళ్యాణ్ బాబు గురించి ఏం అన్నా పట్టించుకోరు. కానీ చిరు గురించి మాట్లాడితే మాత్రం పవన్ నేరుగా రోడ్డు మీదకు వచ్చేస్తారు. ప్రజారాజ్యం బాధలో నుంచి పెట్టిందే జనసేన. ఆరోజు చిరంజీవి గురించి ఏది మాట్లాడిన వాటికి సమాధానమే జనసేన. అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడినా.. రాసిన ఒక్క క్షణం ఆలోచించండి. గాడ్ ఫాదర్ సక్సెస్ వెనక చరణ్ పాత్ర చాలా ఉంది. ఇలాంటి సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టాలంటే ధైర్యం కావాలి. హిట్ కావడమంటే చిన్న విషయం కాదు. చరణ్ వల్లే సల్మాన్ పక్కన నిలబడే ఛాన్స్ వచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు.