
Ram Director Lingusamy: రామ్ హీరోగా హీరోగా లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల రామ్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రారంభంపై ఓ వివాదం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు లింగుస్వామి, నిర్మాత జ్ఞానవేల్ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. దీంతో నిర్మాత జ్ఞానవేల్ గతంలోనే ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. పందెం కోడి సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం ఏర్పడడంతో జ్ఞానవేల్ తమిళ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. అయితే కోర్టు పరిధిలో ఉన్న వివాదంపై తాము స్పందించమంటూ తమిళ సంఘం తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు లింగుస్వామి ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాత జ్ఞానవేలు డైరెక్టర్ లింగుస్వామిపై ఫిర్యాదు చేశారు. పాత సినిమా విషయంలో తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు తేల్చకుండా మరో సినిమా డైరెక్ట్ చేస్తున్న లింగుస్వామి విషయంలో తనకు న్యాయం చేయాలని జ్ఞానవేల్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ కొత్త సినిమా ప్రారంభానికి ముందే వివాదాలకు కేరాఫ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను జూలై 12 నుంచి హైదరాబాద్‌లో మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ వివాదం రామ్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Also Read: Prabhas: ఇంజనీర్లను హైర్ చేసుకుంటున్న డార్లింగ్.. ఎందుకో తెలుసుకుందాం పదండి
Michael Jackson : మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 ఆశ్చర్యకరమైన నిజాలు..! మీకు తెలుసా..?