Tollywood : ఆ సినిమా ప్లాప్ అయ్యిందని ఇల్లు, ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎం ఎస్ రాజు..
తెలుగు సినిమా ప్రపంచంలో అనేక భారీ బడ్జెట్, సక్సె్స్ చిత్రాలతో పాపులర్ అయ్యారు నిర్మాత ఎంఎస్ రాజు. దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. 'సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సినిమాలు భారీ విజయాలను సాధించాయి.

ప్రముఖ సినీ నిర్మాత ఎం ఎస్ రాజు తన సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, ముఖ్యంగా ఒక పెద్ద పరాజయం నుండి తిరిగి ఎలా విజయం సాధించారో వివరించారు. దర్శకుడు కోడి రామకృష్ణతో రెండు విజయవంతమైన చిత్రాలు చేసిన తర్వాత, ఆయన తదుపరి చిత్రం కోసం దర్శకుడు బి. గోపాల్‌తో స్ట్రీట్ ఫైటర్ సినిమాను నిర్మించారు. అయితే, ఆ సమయంలో కోడి రామకృష్ణ అందుబాటులో లేకపోవడం, సినిమాను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. స్ట్రీట్ ఫైటర్ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతకుముందు రెండు చిత్రాల విజయం ఇచ్చిన ఉత్సాహంతో, నిర్మాత చిత్రం కోసం అదనంగా ఖర్చు పెట్టారు. విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు, గుర్రాలు వంటివి ఉపయోగించడం వల్ల బడ్జెట్ అదుపు తప్పింది. ఈ ఖర్చు సరైనదా కాదా అనే ఆలోచన లేకుండా, విజయం తాలూకు ఆనందంలోనే చిత్రంపై అధికంగా వెచ్చించారు. కానీ, చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడం, బడ్జెట్ అధికం కావడం వల్ల భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆర్థికంగా దెబ్బతినడంతో పాటు, సినిమా కూడా ఆకట్టుకోలేకపోవడం ఆయన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇది ఆయన కెరీర్‌లోని అతి పెద్ద గుణపాఠంగా మారిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
ఈ పరాజయం తర్వాత నిర్మాత తన సొంత ఇంటిని అమ్మివేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. మురుగాలయ్య స్టూడియో సమీపంలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆ ఇంటిని ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు. ఇంటిని అమ్మేసిన తర్వాత ఒక పార్టీలో కొందరు అగ్ర నిర్మాతల మాటలు ఆయన్ను మరింత కుంగదీశాయి. ఆ క్షణంలో తీవ్ర భావోద్వేగానికి గురై, నియంత్రణ కోల్పోయి, తన కారులో వేగంగా ఇంటికి వెళ్లి, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ “సార్ మీరు ఇల్లు అమ్మేశారు కదా” అన్న మాటతో ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు. ఆ సంఘటన ఆయన జీవితంలో ఒక మలుపుగా మారిందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
ఈ కష్టాల నుండి బయటపడటానికి, తన కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టడానికి ఆయన దేవి చిత్రాన్ని తీశానని.. ఈ సినిమా నిర్మాణం ఆర్థికంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. డబ్బు లేకపోయినా, తనకున్న గుడ్‌విల్ ఆధారంగా ఫైనాన్షియర్‌ల నుండి కొంత మొత్తాన్ని పొందగలిగానని అన్నారు. దేవి ఒక గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం. దీని కోసం గ్రాఫిక్స్, సెట్‌లు, పాములతో చిత్రీకరణ, హిమాలయాలు, కేరళ వంటి వివిధ ప్రదేశాలలో షూటింగ్ జరిపారు. కథ, దర్శకత్వ చర్చలు, డబ్బుల సర్దుబాటు, షూటింగ్ పర్యవేక్షణ వంటి ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్ల మధ్య ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ తీవ్రమైన కృషి, నిబద్ధత ఫలితంగా దేవి ఘన విజయం సాధించింది. ఆ సినిమా విజయంతో, నిర్మాతకు మళ్ళీ ఆర్థిక స్థిరత్వం లభించింది, ఆ తర్వాత ఏ చిత్రానికీ డబ్బుల కోసం ఇబ్బంది పడలేదని ఆయన వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
