యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ (Prabhas).. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్చన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో అమితాబ్, దీపికా పదుకొణె కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అకాలమరణంతో డార్లింగ్ సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటున్నారు. అయితే డార్లింగ్ సినిమాస్ అప్టేడ్స్ కోసం ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. వాస్తవానికి ప్రాజెక్ట్ కె సినిమా కోసం ముందుగా హీరోయిన్గా దీపికాను ఎంపిక చేయలేదట. మరో బాలీవుడ్ బ్యూటీని సెలక్ట్ చేశారట. ఆ భామ ఎవరో కాదు .. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావించారట. ఇందుకు ముందుగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను ఎంచుకున్నారట. ఇక ఇదే సమయంలో డైరెక్టర్ హనురాఘవపూడి చెప్పిన స్టోరీ విని.. ఈ ప్రేమకథకు మృణాల్ అయితే చక్కగా ఉంటుందని.. నచ్చితే ఆమెను సెలక్ట్ చేయండి. ప్రభాస్ సినిమా కోసం మరో హీరోయిన్గా తీసుకుంటా అని సూచించినట్లుగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తెలిపారు. డైరెక్టర్ హను రాఘవపూడి రూపొందించిన సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించగా.. రష్మిక, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్, సుమంత్, భూమిక కీలకపాత్రలలో కనిపించారు.