The Kashmir Files: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత నుంచి సినిమా స్వరూపమే మారిపోయింది. ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తుంది. పెద్ద సినిమాలకు మించి రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో `ది కశ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సినిమా పై ప్రధాని మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అందరు తప్పనిసరిగా చూడాలని మోడీ అన్నారు. ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లను రాబడుతూ.. దూసుకుపోతుంది. 12 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే 120 కోట్ల వరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. కశ్మీర్ ఫైల్స్ ఘనవిజయం సాధించడం తో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్
అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా అన్నారు. సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్ వచ్చి కలిసింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుండి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. 2 వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు.
సినిమా అనేది కమర్షియల్. కానీ 5 లక్షల మంది కశ్మీర్ పండిట్ ల బాధలు, సమస్యలను 32 ఏళ్ళనాటివి బయటకు తెచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ ఫీలింగ్ ను వ్యక్తం చేశారు. ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం.. మూడు నెలలపాటు యు.ఎస్., కెనడ, దక్షిణాఫ్రికా ఇలా పలు ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకు ముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగా ప్రిపేర్ అయ్యాను. కరెక్ట్గా చెప్పాలంటే నిజాయితీగా తీస్తే భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు. త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం. మా సినిమాకు అస్సాం, యు.పి., గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో చెప్పలేని కొన్ని విషయాలున్నాయి. ఏది ఏమైనా 370 ఆర్టికల్ వరకే సినిమా తీశాం. ఆ తర్వాత కంటిన్యూ చేసే ఆలోచన ప్రస్తుతం లేదు అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :