Thalapathy Vijay: దళపతి విజయ్‌తో సినిమా చేయనని కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. చివరకు

ఓ హీరోయిన్ మాత్రం విజయ్ తో సినిమా చేయమంటే మాత్రం చేయను అని కన్నీళ్లు పెట్టుకుందట. విజయ్ ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్స్ తో పని చేశారు. తెలుగు తమిళ్ భాషల్లోని స్టార్ హీరోయిన్స్ తో విజయ్ రొమాన్స్ చేశారు. అయితే ఆయనతో సినిమా చేయంనంటే చేయను అని ఆ హీరోయిన్ చెప్పిందట.

Thalapathy Vijay: దళపతి విజయ్‌తో సినిమా చేయనని కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. చివరకు
Thalapathy Vijay

Updated on: May 30, 2024 | 5:04 PM

దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన విజయ్ తో సినిమా చేయడానికి హీరోయిన్స్ క్యూ కడతారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం విజయ్ తో సినిమా చేయమంటే చేయను అని కన్నీళ్లు పెట్టుకుందట. విజయ్ ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్స్ తో పని చేశారు. తెలుగు తమిళ్ భాషల్లోని స్టార్ హీరోయిన్స్ తో విజయ్ రొమాన్స్ చేశారు. అయితే ఆయనతో సినిమా ఈ హీరోయిన్ చేయను అని చెప్పిందట. ఆ తర్వాత ఆమెను బ్రతిమాలి, బిజ్జగించి ఆ సినిమా చేయించారట. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు.? ఎందుకు విజయ్ తో సినిమా చేయను అని చెప్పింది.?

దళపతి విజయ్ సరసన నటించాడని బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఆఫర్ వచ్చిందట. కానీ ఆమె ఆ సినిమా చేయను అని ఏడ్చేసిందట. అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు 2002లో జరిగిందట. ఈ విషయాన్నీ ప్రియాంక తల్లి మధు చోప్రా వెల్లడించారు ఈ సంఘటన 2002లో జరిగింది. దాన్ని తాజాగా మధు చోప్రా గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రియాంక చోప్రా 2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఆమెకు ఆఫర్ వచ్చింది. దళపతి విజయ్‌ నటిస్తున్న ‘తమిళన్‌’ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఆఫర్‌ వచ్చింది. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఆ సినిమా చేయనని ఏడ్చిందట.

ప్రియాంకకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. అదే సమయంలో సౌత్ ఇండియన్ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ విషయం చెప్పగానే ఆమె ఏడవడం మొదలుపెట్టింది. సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. కానీ నేను ఒప్పుకోమని చెప్పడంతో ప్రియాంక సంతకం చేసింది’ అని మధు చోప్రా తెలిపారు. ఆ సినిమా తర్వాత ప్రియాంకకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

దళపతి విజయ్‌తో సినిమా చేసిన తర్వాత ప్రియాంకాకు సినిమాల పై ఇష్టం ఏర్పడిందట. దళపతితో నటించడం ప్రియాంకకు నచ్చింది. తమిళం తెలియకపోయినా షూటింగ్‌ని ఎంజాయ్ చేసింది. సిబ్బంది ఆమెను చాలా బాగా చూసుకున్నారు. విజయ్ పెద్ద స్టార్. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. మొదట్లో విజయ్ తో డ్యాన్స్ స్టెప్పులను మ్యాచ్ చేయలేకపోయింది ప్రియాంక. తర్వాత కొరియోగ్రాఫర్ దగ్గర ప్రాక్టీస్ చేసి షూటింగ్ లో పాల్గొంది’ అని మధు చోప్రా గుర్తు చేసుకున్నారు.

 ప్రియాంక చోప్రా ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.