Jr NTR : గోబల్ బ్యూటీతో యంగ్ టైగర్.. వైరల్ అవుతోన్న తారక్‌, ప్రియాంకా ఫోటో

ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Jr NTR : గోబల్ బ్యూటీతో యంగ్ టైగర్.. వైరల్ అవుతోన్న తారక్‌, ప్రియాంకా ఫోటో
Ntr, Priyanka Chopra

Updated on: Mar 14, 2023 | 4:07 PM

ఆస్కార్ అవార్డుల వేడుకలో హంగామా అంతా ఆర్ఆర్ఆర్ టీమ్ దే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం ఇండియాని రిప్రజెంట్ చేశారు. ఈ వేడుకలో దీపికా పదుకునే ప్రియాంక చోప్రా కూడా ఇండియాని రిప్రజెంట్ చేశారు.

అలాగే ఆర్ఆర్ఆర్ టీమ్ తో చాలా మంది హాలీవుడ్ స్టార్స్ ఫోటోలు దిగారు. ఈ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇండియా జాతీయ జంతువు పులి బొమ్మను తన డ్రస్ పై డిజన్ చేయించారు తారక్.

ఆస్కార్ కంటే ముందు ప్రీ ఆస్కార్ పార్టీని ప్రియాంక చోప్రా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఆర్ఆర్ఆర్ టీమ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా తారక్ ని ప్రత్యేకంగా స్టేజ్ పైకి ఆహ్వానించి అతిథులు అందరికి పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Ntr