Priya Prakash Varrier: హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదంటోన్న ప్రియా ప్రకాష్ .. అనుకోకుండానే రంగుల ప్రపంచంలోకి ఎంట్రీ..

మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగుతోపాటు మిగత భాషల్లోనూ డబ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ప్రియాకు అంతగా అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు నటించిన చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవలే బ్రో సినిమాతో తెలుగు తెరపై సందడి చేసింది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ చిత్రంలో తేజ్ చెల్లి పాత్రలో కనిపించింది. అయితే సినీ ప్రపంచంలో కథానాయికగా ఓ వెలుగు వెలగాలని ప్రియా ఎప్పుడూ అనుకోలేదట.

Priya Prakash Varrier: హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదంటోన్న ప్రియా ప్రకాష్ .. అనుకోకుండానే రంగుల ప్రపంచంలోకి ఎంట్రీ..
Priya Prakash Warrier

Updated on: Oct 07, 2023 | 10:16 AM

ఒరు అదార్ లవ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రంలో ఆమె నటనకు.. కన్నుకొట్టే ఎక్స్‏ప్రెషన్‏తో క్రేజ్ సంపాదించుకుంది. తొలి సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగుతోపాటు మిగత భాషల్లోనూ డబ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ప్రియాకు అంతగా అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు నటించిన చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవలే బ్రో సినిమాతో తెలుగు తెరపై సందడి చేసింది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ చిత్రంలో తేజ్ చెల్లి పాత్రలో కనిపించింది. అయితే సినీ ప్రపంచంలో కథానాయికగా ఓ వెలుగు వెలగాలని ప్రియా ఎప్పుడూ అనుకోలేదట. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడమంటే తనకు ఎంతో ఇష్టమని.. సినిమాలు చూసి ఇంట్లో అద్దం ముందు నిలబడి నచ్చిన హీరోయిన్స్ పాత్రల మాదిరిగా నటించేదానని చెప్పుకొచ్చింది. కానీ తాను నటి అవుతానని తన తల్లిదండ్రులే కాదు.. తానూ కూడా ఊహించలేదని తెలిపింది. చదువుకుంటున్న సమయంలోనే అడిషన్ లో పాల్గొని సెలక్ట్ అయ్యానని.. ఆ సినిమా పూర్తి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు చెప్పుకొచ్చింది. ఓరు అదార్ లవ్ సినిమాతో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో నటిగా మారినట్లు తెలిపింది.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించి అలరించింది ప్రియా. ఇప్పుడు ఈ బ్యూటీకి హిందీలోనూ అవకాశాలు వస్తున్నాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. కొద్దిరోజులుగా ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోస్.. వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.