Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..

|

Apr 18, 2021 | 9:33 PM

Priyaprakh Warrier: ఒక చిన్న క‌న్ను గీటే సీన్‌తో యావ‌త్ భార‌తీయ సినిమా ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్నారు అందాల తార ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఎలాంటి సినిమా అనుభ‌వం లేక‌పోయినా...

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..
Priya Prakash
Follow us on

Priyaprakh Warrier: ఒక చిన్న క‌న్ను గీటే సీన్‌తో యావ‌త్ భార‌తీయ సినిమా ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్నారు అందాల తార ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఎలాంటి సినిమా అనుభ‌వం లేక‌పోయినా ఓ చిన్న స‌న్నివేశంతో అంత మంది దృష్టిని ఆక‌ర్షించిన ఏకైక న‌టి బ‌హుశా ప్రియానే అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఈ వీడియో తెచ్చి పెట్టిన క్రేజ్‌తో ప్రియాకు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. టాలీవుడ్ నుంచి మొద‌లు పెడితే బాలీవుడ్ వ‌ర‌కు ప్రియాకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి.
తెలుగులో నితిన్ హీరోగా తెర‌కెక్కిన చెక్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రియా ప్ర‌కాశ్ త‌న రెండో చిత్రంగా ఇష్క్ అనే చిత్రంలో న‌టిస్తోంది. య‌మ్ ఎస్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాలో తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే సినిమా ప్ర‌మోష‌న్ ప‌నుల‌ను మొద‌లు పెట్టింది. ఇందుకోసం గంగవ్వ‌ను కూడా ఉప‌యోగించుకున్నారు చిత్ర యూనిట్ స‌భ్యులు. ఈ నేప‌థ్యంలోనే ఓ ప్ర‌మోష‌న్ వీడియో నెటిజ‌న్ల‌కు న‌వ్వులు తెప్పిస్తోంది. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్‌ ఇచ్చింది గంగ‌వ్వ‌. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన బీఏ రాజు.. “క‌న్ను కొట్టినంత వీజీ కాదు మూతి తిప్పుడు అంటూ కామెంట్ చేశారు”. మ‌రి ఈ ఫ‌న్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

గంగ‌వ్వ‌, ప్రియా ప్ర‌కాష్ ఫ‌న్నీ వీడియో..

Also Read: కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయ్, బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, కేంద్రమా ! నీదే భారం ! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

19 మంది కుంభ్ మేళా భక్తులకు కరోనా పాజిటివ్, చికిత్స పొందుతూ ఆసుపత్రి నుంచి పరార్

KCR-Yadiyurappa Meet: కర్నాటక ముఖ్యమంత్రిని కల్వనున్న కేసీఆర్.. రాజోలిబండ సమస్యపై సీఎం ఫోకస్