వంద సార్లు రిజక్ట్ చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఆమె ఎవరంటే

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా క్రేజ్ సొంతం చేసుకున్న భామలు చాలా మంది కెరీర్ బిగినింగ్ లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. చాలా మంది భామలు ఇంటర్వ్యూలో కెరీర్ బిగినింగ్ లో కష్టాలను ఎదుర్కొన్నాం అని, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ బ్యూటీ కూడా కెరీర్ బిగింగ్ లో ఎన్నో కష్టాలను చూసింది.

వంద సార్లు రిజక్ట్ చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఆమె ఎవరంటే
Actress

Updated on: Feb 13, 2025 | 12:04 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు.. అవకాశాల కోసమే ఎంతో మంది చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉంటారు. ఎన్నో ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. ఎన్నో సార్లు ఆడిషన్స్ లో రిజెక్ట్ అవుతూ ఉంటారు. ఎట్టకేలకు హీరోయిన్ గా అవకాశం అందుకుంటే చాలు వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కాగా తాజాగా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న ఓ ముద్దుగుమ్మ కెరీర్ స్టార్టింగ్ లో ఏకంగా 100సార్లు రిజెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ప్రియా బాపట్. ఈ అమ్మడు మరాఠా సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే బాలీవుడ్ లోనూ నటించి మెప్పించింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ముంబైలో 1986లో జన్మించిన ఈ నటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా 2000లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

ఇక బాలీవుడ్ లో సంజయ్ దత్ హీరోగా నటించిన మున్నాభాయ్ MBBS సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ‘లగేరహో మున్నాభాయ్‌‌’లో కూడా నటించింది.  ఈ బ్యూటీ కెరీర్ లో మంచి సినిమాలు పడ్డాయి కానీ ఆమె జర్నీ అంత ఈజీగా సాగలేదు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది ఈ అమ్మడు. ఓ టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో సెలక్ట్ కావడానికి ముందు వందసార్లు ఆమెను రిజెక్ట్ చేశారట. అన్ని సార్లు త్రిమస్కరించినా కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా అవకాశలకోసం ప్రయత్నించి చివరికి సక్సెస్ అయింది ప్రియా. ఇప్పుడు హీరోయిన్ గా తన ప్రతిభను చాటుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

ప్రియా బాపట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి