AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar: గేమ్ ఛేంజర్ తర్వాత ఆ హీరోను లైనప్ చేసిన శంకర్.. ప్లాన్ మాములుగా లేదుగా

శంకర్ దర్శకత్వంలో సినిమాలు అంటే ప్రేక్షకుల్లో స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి ఆకట్టుకున్నాడు శంకర్. రీసెంట్ గా వరుస ఫ్లాప్స్ తో సతమతం అలవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

Shankar: గేమ్ ఛేంజర్ తర్వాత ఆ హీరోను లైనప్ చేసిన శంకర్.. ప్లాన్ మాములుగా లేదుగా
Shankar
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2025 | 11:47 AM

Share

టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు ఒకప్పుడు యమా క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఈ మధ్య శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. రోబో 2 సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రోబో రేంజ్ లో హిట్ అవ్వలేదు. అలాగే రీసెంట్ గా  వచ్చిన ఇండియన్ 2 సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాదాపు 22ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఇండియన్ 2 సినిమా ప్రేక్షకులను  నిరాశపరిచింది.

ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అవడంతో శంకర్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఆతర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. కానీ ఈ సినిమా విడుదలై తర్వాత దారుణంగా నిరాశపరిచింది. దాదాపు 500కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ సినిమాకు కలెక్షన్స్ పడిపోయాయి.

దాంతో శంకర్ అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. దాంతో ఇప్పుడు శంకర్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. శంకర్ ఏ హీరోతో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారిపోయింది. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అయితే శంకర్ ఇప్పుడు విక్రమ్ కుమారుడు ధృవ్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే టాపిక్ కోలీవుడ్ లో తెగ వినిపిస్తుంది. శంకర్ విక్రమ్ తో అపరిచితుడు, ఐ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఆయన కొడుకుతో సినిమా చేయనున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

Source: இயக்குநர் சங்கரின் அடுத்தப் படத்தின் ஹீரோ இவரா? வைரலாகும் தகவல்

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్