Prithviraj Sukumaran: షూటింగ్‌లో గాయపడ్డ ‘సలార్‌’ విలన్‌.. మూడు నెలల పాటు బెడ్‌ రెస్ట్‌.. ఫ్యాన్స్‌లో ఆందోళన

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. మలయాళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న ఇతని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్‌ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఈ హీరో. ఈ క్రేజ్‌తోనే ప్రభాస్ నటిస్తోన్న 'సలార్‌' సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో

Prithviraj Sukumaran: షూటింగ్‌లో గాయపడ్డ సలార్‌ విలన్‌.. మూడు నెలల పాటు బెడ్‌ రెస్ట్‌.. ఫ్యాన్స్‌లో ఆందోళన
Prithviraj Sukumaran

Updated on: Jun 26, 2023 | 8:28 AM

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. మలయాళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న ఇతని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్‌ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఈ హీరో. ఈ క్రేజ్‌తోనే ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్‌’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు పృథ్వీరాజ్‌. తన లేటెస్ట్‌ సినిమా ‘విలాయత్ బుద్ధ’ షూట్‌లో యాక్షన సీన్స్‌ షూట్‌ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడీ హీరో. . KSRTC బస్సులో ఓ ఫైట్‌ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు పృథ్వీరాజ్‌. దీంతో వెంనే ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. హీరోను పరీక్షించిన వైద్యులు నేడు లేదా రేపు సర్జరీ చేయనున్నట్లు తెలిసింది. కాగా ఈ ఆపరేషన్‌ తర్వాత పృథ్వీరాజ్ సుమారు 3 నెలలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందట. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

తెలుగులో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన గాడ్‌ ఫాదర్‌, భీమ్లానాయక్‌ సినిమాల ఒరిజెనల్‌ వెర్షన్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించారు. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తాచాటారు. గాడ్‌ ఫాదర్ ఒరిజినల్‌ వెర్షన్‌ (లూసీఫర్‌), బ్రో డాడీ వంటి సినిమాలకు పృథ్వీరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈక్రమంలో బ్రోడాడీని కూడా తెలుగులో రీమేక్‌ చేసే అవకాశాలున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ఇందులో కీ రోల్ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us