
గతేడాది సలార్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇందులో దేవ పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా.. వరదరాజ్ మన్నార్ పాత్రలో పృథ్వీ నటించి మెప్పించాడు. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ఇటీవలే ఆడు జీవితం సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ బడే మియాన్ చోటే మియాన్ సినిమాతో మరోసారి అడియన్స్ ను పలకరించండి. ఇందులో మరోసారి తన నటనతో మెప్పించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చాలా రోజులుగా కొన్ని నగరాల్లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య సుప్రియా మీనన్ తో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను పంచుకున్నాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్‌కి కార్లంటే విపరీతమైన క్రేజ్. కానీ అతడి భార్య సుప్రియ చాలా సింపుల్. ఆమెకు ఖరీదైన, లగ్జరీ కార్లంటే అంతగా ఆసక్తి ఉండదు. అయితే తన భార్యను సర్ ప్రైజ్ చేసేందుకు ఫెరారీ కారు కొనుగోలు చేశాడట. ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ తన భార్య దగ్గరకు వెళ్లగా ఆమె తనకు ట్విస్ట్ ఇచ్చిందని అన్నారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “నా భార్యకు ఎప్పుడూ కారు గురించే ఆలోచించడం ఇష్టం ఉండదు. ఆమెకు కార్లపై పెద్దగా ఆసక్తి లేదు. నేను ఒకప్పుడు స్కాట్లాండ్‌లో ఉన్నాను. ఆ తర్వాత ఫెరారీ కాలిఫోర్నియా కారును పరిచయం చేసింది. ఆ కారు నిజంగా అందంగా ఉంది. రోడ్డు కూడా అద్భుతంగా ఉంది. కారు నడపడంలో చాలా ఎంజాయ్ చేసేవాడిని. కానీ నా భార్యకు ఆ కారు ఇష్టం లేదు. ఆ కారులో రానను చెప్పింది.
అప్పుడే మా అసిస్టెంట్స్ మాములు కారులో మా వెనక వస్తున్నాడు. దీంతో అతడికి ఫెరారీ కారును ఇచ్చి.. నేను, నా భార్య మాములు కారులో స్కాట్లాండ్ చుట్టేసాము. మా అసిస్టెంట్ నన్ను ఫెరారీ కారులో ఫాలో అయ్యాడు” అంటూ చెప్పుకొచ్చాడు. పృథ్వీరాజ్ సుకుమారన్‌కి కార్లంటే చాలా ఆసక్తి. చిన్నప్పుడు తండ్రి కారులో కూర్చుని స్టీరింగ్ పట్టుకునేవాడు. ఈ సంఘటనలు అతనికి సినిమాపై ఆసక్తిని కలిగించాయి.పృథ్వీరాజ్ మొత్తం ఆస్తులు 54 కోట్ల రూపాయలు. అతని వద్ద లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్ AMG G63 ఉంది. దీనికి ‘0001’ అనే నంబర్ ప్లేట్ ఉంది. ఇది కాకుండా, రేంజ్ రోవర్ వోగ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్షా మొదలైన కార్లు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.