
ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా ‘ప్రేమలు’. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ను తెలుగులో డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ రిలీజ్ చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని హీరోయిన్ మమితా బైజు తన నటనతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం యూత్ ఫేవరేట్ క్రష్‌గా మారిపోయింది. ప్రేమలు సినిమా తర్వాత ఈ బ్యూటీ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఈ బ్యూటీ నటనకు దర్శకధీరుడు జక్కన్నే ఫిదా అయ్యాడు. రీను పాత్రలో నటించిన ఆ అమ్మాయి నచ్చిందంటూ నెట్టింట ప్రశంసల వర్షం కురింపించాడు. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు నెట్టింట మారుమోగుతుంది. ఇప్పుడు కుర్రాళ్ల హృదయాలను దొచేసిన మమితా బైజుకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఆ హీరో అంటే పిచ్చి అభిమానమట. ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసిందో అసలు లెక్కేలేదని చెబుతుంది మమితా.
ప్రేమలు హీరోయిన్ మమితా బైజు ఫేవరేట్ హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. బన్నీ పై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని.. ఎంతో అభిమానిస్తానని తెలిపింది. ఆయన ప్రతి సినిమాను పదిసార్లు కంటే ఎక్కువే చూశానని.. ఇప్పటికీ ఎప్పటికీ ఎంజాయ్ చేయాలంటే మళ్లీ అవే సినిమాలు పెట్టుకొని చూస్తానని.. బన్నీ అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
కేవలం మమితానే కాదు.. బన్నీ అంటే మలయాళం సెలబ్రెటీలకు.. అక్కడి జనాలు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. బన్నీని అక్కడి వారు మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటారు. ఇదివరకు చాలా సందర్భాల్లో మలయాళీ స్టార్స్ బన్నీ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు ప్రేమలు బ్యూటీ కూడా బన్నీ పై ఇష్టాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
Videopic.twitter.com/gPO5eArY5L
— Srinivas movie buff🐉 (@movieandcricbuf) March 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.