కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి… ప్రయోగాలు చేసే ధైర్యం కొంత మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. అలాంటి గట్స్ ఉన్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ… చేసింది మూడు సినిమాలే అయినా మూడూ డిఫరెంట్ జానర్స్‌ను టచ్ చేసిన ఈ క్రేజీ మేకర్.. నాలుగో సినిమాతో మరో యునిక్ అటెంప్ట్ చేస్తున్నారు. తొలి సినిమాతోనే ఆడియన్స్‌కు అ! అనేంత కొత్తదనం చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. అప్పటి వరకు తెలుగు ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేయని డిఫరెంట్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో తెరకెక్కిన అ! విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత కల్కి అనే పీరియాడిక్ సినిమాతో మరో డిఫరెంట్ జానర్‌లో థ్రిల్ చేశారు ప్రశాంత్ వర్మ.
మూడో ప్రయత్నంగా హాలీవుడ్ సినిమాల్లోనే కనిపించే జాంబీలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ కాన్సెప్ట్‌ను కరోనాకు రిలేట్ చేస్తూ ప్రశాంత్ వర్మ చేసిన సినిమాటిక్ మ్యాజిక్ తెర మీద కాసులు కురిపించింది. ఇప్పుడు కొత్తగా మరో డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. తెలుగులో తొలి ఒరిజినల్ సూపర్ హీరో సినిమాగా హనుమాన్ ను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాతో ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో అలరిస్తారో చూడాలి.
Also Read: జూన్ 4న ఎస్పీబీ జయంతి సందర్భంగా తెలుగు చిత్ర సీమ స్వరనీరాజనం