MAA Elections 2021: ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎవరికీ వారు రాజకీయాలు మొదలు పెట్టేశారు. మైక్ కనిపిస్తే చాలు ఒకరి మీద ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో ‘మా’లో లుకలుకలన్నీ బయటపడిపోతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. మరో నలుగురిలో హేమ- జీవిత- సీవీఎల్ వంటి వారు రేసులో ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇక నరేష్ వర్గంలోని 100 ఓట్లు కూడా ఈ సారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఎవరు గెలిచినా 2021-24 సీజన్‌కి అధ్యక్షుడిగా ‘మా’ను ఏలుతారు. ఇన్నాళ్లు ఏకగ్రీవం అంటూ వినిపించినా.. దానికంటే ఎన్నికలే బెటరనే ఉద్ధేశం పెద్దల్లో బయటపడడంతో.. ఎన్నికల పోరులో ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో తన ప్యానెల్ లో ఎవరు ఎవరు ఏ పోస్ట్ కు పోటీ చేయబోతున్నా రో ప్రకటించారు ప్రకాష్ రాజ్.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..లాస్ట్ టైం ప్రెస్ మిట్ లో మేము ఏమి చేస్తాము అని చెప్పాము. దీని గురించి చాలా మందితో చర్చించాం.. సినిమా బిడ్డల ప్యానెల్ అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ గా వుంటు అందరినీ రిప్రజెంటేషన్ చెయ్యాలి. నేను అనౌన్స్ చేసే ప్యానెల్ లో అందరినీ అడిగే, వారి సలహాలు తీసుకునే పేర్లు అనౌన్స్ చేస్తున్నాను అంటూ ఎవరు ఏ పోస్ట్ కు పోటీ చేయబోతున్నా రో తెలిపారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో 18 మంది ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ ఉన్నారు. వారిలో..అనసూయ-అజయ్-భూపాల్-బ్రహ్మాజీ-ఈటీవి ప్రభాకర్-గోవింద్ రావు-ఖయ్యుం-కౌశిక్-ప్రగతి-రమణారెడ్డి-శ్రీధర్ రావు-శివారెడ్డి-సమీర్-సుడిగాలి సుధీర్-సుబ్బరాజు-సురేష్ కొండేటి-తనీష్-టార్జాన్ ఉన్నారు అయితే దీనిలో జయసుధ గారూ మెయిన్ ప్యానెల్ లో లేరు. ఆమె అమెరికాలో వున్నారు ఆవిడ అన్ని పనులు పూర్తి అయ్యి వచ్చే పాటికి కొన్ని రోజులు పడుతుంది. ఇక మెయిన్ ప్యానెల్ విషయానికికొస్తే .. కోశాధికారి-నాగినీడు-జాయింట్ సెక్రటరీ…అనితా చౌదరి-జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్-వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ-వైస్ ప్రెసిడెంట్‌గాహేమ-ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గాశ్రీకాంత్-జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్-అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పేర్లు అనౌన్స్ చేశారు. పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎలక్షన్స్ అనేవి ప్రజాస్వామ్యం. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మంచి చెడు మీద చర్చ జరుగుతుంది. దాని వల్ల పని చేసే వాళ్లకు అవకాశం వస్తుంది. విష్ణు గారు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు మా భవనం అంటున్నారు. దానికన్నా చాలా సమస్యలు వున్నాయి. మా భవనం కావాలి అని అందరూ సభ్యులు అనుకుంటే విష్ణునే ఎన్నుకుంటారు అన్నారు. అలాగే టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం గురించి మీడియా ప్రశ్నించగా.. డ్రగ్స్ అనేది చాలా తప్పు. విచారణ జరుగుతోంది ప్రూవ్ అయితే చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :