Prabhu Deva: కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రభుదేవా.. తండ్రీ కొడుకుల డ్యాన్స్ చూశారా? వీడియో

హీరోలు, దర్శకులు తమ పిల్లలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు ఇలాగే చేశారు. ఇప్పుడు ప్రముఖ నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తన కుమారుడు రిషి దేవాను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

Prabhu Deva: కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రభుదేవా.. తండ్రీ కొడుకుల డ్యాన్స్ చూశారా? వీడియో
Prabhu Deva

Updated on: Feb 27, 2025 | 4:32 PM

ప్రభుదేవా తన కుమారుడు రిషి దేవాను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రిషి తన తండ్రి లాగే మంచి డ్యాన్సర్. సుందరం మాస్టర్, రాజు సుందరం.. ఇలా ప్రభుదేవా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది డ్యాన్సర్లు ఉన్నారు. ఇప్పుడు రిషి కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తారని భావిస్తున్నారు. ఇటీవలే ప్రభుదేవా చెన్నైలో ఒక డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించారు. ఇదే వేదికపై తన కొడుకును అందరికీ పరిచయం చేశారు. అనంతరం ఇదే వేదికపై తండ్రీ కొడకులిద్దరూ సరదాగా డ్యాన్స్ వేసి ఆహూతులను అలరించారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా సంబరాలు చేసుకున్నారు. ‘నా కొడుకు రిషి దేవ్ ని పరిచయం చేయడానికి నేను గర్వపడుతున్నాను. అతన్ని మీకు మొదటిసారి పరిచయం చేస్తున్నాను. ఇది కేవలం నృత్యం కాదు, ఇది ఒక వారసత్వం, ఒక అభిరుచి. ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని ప్రభుదేవా తన కొడుకు డ్యాన్స్ చేస్తున్న వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ప్రభుదేవా కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రభుదేవా బాటలోనే రిషి డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని విషెస్ చెబుతున్నారు.

ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెయ్యికి పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన ఘనత ఆయన సొంతం. అంతేకాదు పలు రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం కూడా ఫేమస్ కొరియోగ్రాఫర్. తన డ్యాన్స్ ట్యాలెంట్ కు జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక ప్రభుదేవా మరో సోదరుడు నాగేంద్ర ప్రసాద్ కూడా ఒక ప్రముఖ నృత్యకారుడే.

ఇవి కూడా చదవండి

ప్రభుదేవా కుమారుడి డ్యాన్స్.. వీడియో..

ఇప్పుడు వీరి బాటలోన నడిచేందుకు రెడీ అవుతున్నాడు రిషి దేవ్. ప్రభుదేవా, రామలత దంపతుల కుమారుడే రిషి. అయితే ఇప్పుడు రామలత, ప్రభుదేవా విడివిడిగా ఉన్నారు.

కుమారుడితో ప్రభుదేవా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.