మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఇది. ముఖ్యంగా చాలా యాక్షన్ హీరోగా ప్రభాస్ కనిపించి చాలా కాలమైంది. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రభాస్ కెరీర్లో రాబోయే మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు సలార్ మూవీపైనే ఉన్నాయి. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తుండడంతో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. ఇక గతంలో విడుదలైన టీజర్‌తో సినిమా ఏ రేంజ్‍లో చెప్పేశాడు నీల్. ఇందులో ప్రభాస్ మునుపెన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి నిత్యం ఏదోక ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంటుంది.
తాజాగా ఈ సినిమా మరో సెన్సెషన్ ఫీట్ సాధించింది. బుక్ మై షో యాప్ లో ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ లక్ష ఇంట్రెస్ట్ అద.. కూడా మేజర్ అప్డేట్ లేకుండానే ఇంతగా ఈ మూవీకి నమోదు కావడం. ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే మరో సెట్ చెయ్యని ఫీట్ అందుకుంది. బుక్ మై షోలో హాఫ్ మిలియన్ కి పై ఇంట్రెస్ట్స్ ను నమోదు చేసింది. దీంతో ఈ సినిమా కోసం భారతీయులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయిక కాగా.. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇటీవలే మోకాలీ సర్జరీ పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయి.
𝐆𝐞𝐚𝐫 𝐮𝐩 𝐟𝐨𝐫 𝐚𝐧 𝐞𝐱𝐩𝐥𝐨𝐬𝐢𝐯𝐞 𝐜𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 💥#SalaarCeaseFire Trailer is set to detonate on Dec 1st at 7:19 PM 🔥
Happy Deepavali Everyone 🪔 #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/rf0wwNvWX5
— Hombale Films (@hombalefilms) November 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.