
ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే.. ఎలాంటి అనుమానం లేకుండా ప్రభాస్ అని ఎవరైనా చెప్పేస్తారు. ఈ రేంజ్ ఇమేజ్ ఉన్నా… సినిమాల మేకింగ్ విషయంలో మాత్రం డార్లింగ్ జెట్ స్పీడు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆరు సినిమాలు లైన్‌లో పెట్టిన ప్రభాస్.. మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కథలు ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో డార్లింగ్ ఇన్ని సినిమాలకు డేట్స్ ఎలా ఇస్తారు? ఆ సినిమాల షూటింగ్స్ ఎలా ప్లాన్ చేస్తారు అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. వీటితో పాటు కల్కి 2, సలార్ 2 సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ తోనూ ప్రభాస్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. తాజాగా రిషబ్ శెట్టి కథతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టిన ప్రభాస్ ఆ సినిమాల మేకింగ్ విషయం లోనూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు.
వరుస సినిమాలు లైన్‌లో పెడుతున్న ప్రభాస్.. ఒక్కో సినిమా షూటింగ్‌కు 90 రోజులు మాత్రమే కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారట. మిగతా వర్క్ సంగతి ఎలా ఉన్నా… తన పోర్షన్ షూటింగ్ మాత్రం 90 రోజుల్లోనే పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలకు కండిషన్ పెడుతున్నారట. ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకొని అయినా… మేకింగ్ విషయంలో మాత్రం జాప్యం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. కేవలం మేకింగ్ మాత్రమే కాదు.. సినిమాల రిలీజ్ విషయంలో కూడా స్ట్రిక్ట్ గా ఉండాలని డార్లింగ్ ఫిక్స్ అయ్యారు. వరుస సినిమాలతో డార్లింగ్ బిజీ కావడం ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం గుడ్ న్యూసే.
ఏడాదికి రెండు రిలీజ్ లు ఉండేలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడు పెంచుతున్నారు. ఏ సినిమాకు ఓకే చెప్పిన ఆ ప్రాజెక్ట్ ను ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్స్ వల్ల ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇక మీదట అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏడాదికి రెండు రిలీజ్‌లు ఉండాలని దర్శక నిర్మాతలకు ఆర్డర్స్ పాస్ చేశారు. మరి ప్రభాస్ లాంటి హీరోతో చేసే సినిమాను 90 రోజులు పూర్తి చేయటం నిజంగా సాధ్యమయ్యే పనేనా..? ఈ విషయంలో దర్శక నిర్మాతల ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? వేచి చూడాల్సిందే.