Prabhas: మారుతి.. ప్రభాస్ ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్.. డార్లింగ్ అలా కనిపించనున్నారా ?..

|

Dec 05, 2022 | 9:14 AM

అందులో  ఒకటి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందనుంది. సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ నెట్టింట హల్చల్ చేశాయి. అయితే వీటిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Prabhas: మారుతి.. ప్రభాస్ ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్.. డార్లింగ్ అలా కనిపించనున్నారా ?..
Prabhas
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డార్లింగ్ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కి్స్తో్న్న ప్రాజెక్ట్ కె శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవే కాకుండా.. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ప్రభాస్ నుంచి రాబోతున్నాయి. అందులో  ఒకటి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందనుంది. సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ నెట్టింట హల్చల్ చేశాయి. అయితే వీటిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అదెంటంటే.. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో ప్రభాస్ ఒక రోల్ పాజిటివ్ ఉండగా.. మరో పాత్ర పూర్తిగా నెగిటివ్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ కోసం మారుతి అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. అంతేకాకుండా ఈ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నారు. నిధి అగర్వాల్.. మాళవిక మోహనన్ కాగా.. మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ జరుగుతుందట.

ఇవి కూడా చదవండి

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ సినిమాపైనే ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.