రానా అంటే ఇష్టం..పెళ్లి మాత్రం ప్రభాస్‌తోనే : కాజల్

|

Oct 28, 2019 | 8:53 PM

చందమామ లాంటి అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకునే నటి కాజల్ ఆగర్వాల్. అందుకే ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం దాటినా అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.. ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది కాజల్.. ప్రస్తుతం కమల్ హసన్ తో ‘భారతీయడు 2’ సినిమాలో నటిస్తుంది. తాజాగా మంచు లక్ష్మి వాఖ్యాత వ్యవహరిస్తున్న ఓ టాక్ షోలో పాల్గొంది ఈ ముద్దు గుమ్మ. ఈ సందర్భంగా మంచు లక్ష్మి  కొన్ని స్పైసీ […]

రానా అంటే ఇష్టం..పెళ్లి మాత్రం ప్రభాస్‌తోనే : కాజల్
Follow us on

చందమామ లాంటి అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకునే నటి కాజల్ ఆగర్వాల్. అందుకే ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం దాటినా అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.. ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది కాజల్.. ప్రస్తుతం కమల్ హసన్ తో ‘భారతీయడు 2’ సినిమాలో నటిస్తుంది. తాజాగా మంచు లక్ష్మి వాఖ్యాత వ్యవహరిస్తున్న ఓ టాక్ షోలో పాల్గొంది ఈ ముద్దు గుమ్మ.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి  కొన్ని స్పైసీ క్వచ్చన్స్ అడుగ్గా  కాజల్ కూడా అదే రేంజ్‌లో సమాధానం ఇచ్చింది. నీపైన నువ్వు రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎం చేస్తావ్ అంటే ‘నాకు కావాల్సిన వరుడు దొరికాడు అని చెబుతాను’ అంది కాజల్.. ఇక ఇప్పటివరకు పనిచేసిన హీరోలో ఎవరు నిన్ను ఎక్కువగా ఇరిటేట్ చేస్తారని అడగ్గా.. ‘రానాతో పని చేయాలంటే చాలా ఫన్నీగా ఉంటుంది. షూటింగ్ టైంలో చాలా ఏడిపిస్తూ ఉంటాడు. కానీ చాలా బాగా చూసుకుంటాడని రానా అంటే ఇష్టం’ అని చెప్పుకొచ్చింది.

‘పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారా’ మరో క్వచ్చన్ అడగ్గా, ‘అవును త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’నని చెప్పింది. రామ్‌చరణ్‌, తారక్‌, ప్రభాస్‌లలో ‘ఎవరిని చంపుతారు? ఎవరితో రిలేషన్‌లో ఉంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారని మంచు లక్ష్మి సరదాగా ప్రశ్నించగా, అంతే సరదాగా రామ్‌చరణ్‌ను చంపేస్తానని, తారక్‌తో రిలేషన్‌లో ఉంటానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కాజల్‌ చెప్పుకొచ్చింది. అన్నట్లు ఈ ముగ్గురు హీరోలతోనూ కాజల్‌ యాక్ట్ చేసింది. రామ్‌చరణ్‌తో ‘మగధీర’, ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, ప్రభాస్‌తో ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రాల్లో కాజల్‌ ఆడిపాడింది.