Prabhas : రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ కొత్త పోస్టర్ అదిరిపోయిందిగా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Prabhas : రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ కొత్త పోస్టర్ అదిరిపోయిందిగా..
Rajasaab Movie

Updated on: Jun 03, 2025 | 10:52 AM

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రాజాసాబ్. హారర్ కామెడీ డ్రామాగా వస్తు్న్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

అలాగే ఈనెల 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాలను వెల్లడిస్తూ ప్రభాస్ కు సంబంధించి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యం ఉన్న కథలో నటిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. ఇందులో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..