The Raja Saab: ‘ది రాజా సాబ్’ విడుదలై ఏడు రోజులు.. ప్రభాస్ సినిమాకు ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

సంక్రాంతి కానుకగా జనవరి 09న విడుదలైన ది రాజా సాబ్ మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. బాహుబలి, సాహో, సలార్, కల్కి సినిమాలు చేసిన ప్రభాస్ రేంజ్ కు ది రాజా సాబ్ తగిన సినిమా కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

The Raja Saab: ది రాజా సాబ్ విడుదలై ఏడు రోజులు.. ప్రభాస్ సినిమాకు ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
Prabhas The Raja Saab Movie

Updated on: Jan 16, 2026 | 2:54 PM

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజా సాబ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సలార్, కల్కి రేంజ్ లో ఈ సినిమా లేదని స్వయంగా ప్రభాస్ అభిమానులే పెదవి విరిచారు. అయితే ప్రభాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ది రాజాసాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్‌ దాటేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. అయితే సంక్రాంతి పోటీలో మరిన్ని కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో గత రెండు రోజులుగా ది రాజాసాబ్ వసూళ్లు బాగా తగ్గాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో ప్రభాస్ నటించిన సాహో, ఆదిపురుష్ సినిమాలు మొదటివారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. అలాగే కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. సలార్ కు కూడా భారీగానే వసూళ్లు వచ్చాయి. కానీ రాజాసాబ్ మాత్రం అసలు వీటి దరిదాపుల్లోకి కూడా రాలేదు.

ఇవి కూడా చదవండి

ది రాజాసాబ్ సంక్రాంతి సినిమా పోస్టర్..

పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ది రాజాసాబ్‌ మూవీని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.