The Raja Saab: ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. ప్రభాస్ మళ్లీ అదరగొట్టాడు భయ్యో! రిలీజ్ డేట్ ఇదే

. తాజాగా 'ది రాజా సాబ్' టీమ్ నుండి ప్రభాస్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. ' ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్' పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కిచ్చారు. కేవలం 45 సెకన్ల పాటే ఉన్నప్పటికీ ఈ గ్లింప్స్ వీడియోలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.

The Raja Saab: ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. ప్రభాస్ మళ్లీ అదరగొట్టాడు భయ్యో! రిలీజ్ డేట్ ఇదే
Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Jul 29, 2024 | 5:42 PM

సలార్, కల్కి 2898 ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. క్రేజీ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రభాస్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ‘ది రాజా సాబ్’ టీమ్ నుండి ప్రభాస్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. ‘ ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కిచ్చారు. కేవలం 45 సెకన్ల పాటే ఉన్నప్పటికీ ఈ గ్లింప్స్ వీడియోలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఫ్లవర్ బొకే పట్టుకొని బైక్‌పై రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్ స్టైల్ ను చూసి చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. దీంతో పాటు మరో సర్ ప్రైజ్ ను కూడా ఇచ్చారు మేకర్స్. ది రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుందని గ్లింప్స్‌‍లో అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు ది రాజా సాబ్ మేకర్స్. ‘మాసు.. క్లాసు.. స్వాగు.. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంటు’అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్.

ఇదిలా ఉంటే చాన్నాళ్లుగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ప్రభాస్ నటిస్తున్నారు. అయితే ది రాజా సాబ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుందని గ్లింప్స్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. హార్రర్ రొమాంటిక్ కామెడీ జోనర్‌లో మారుతి తన దైన స్టైల్ లో ప్రభాస్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ పోరీ నిధి అగర్వాల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యోగి బాబు కూడా ఈ సినిమాలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచి బొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ నయా లుక్..

ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్.. ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.